MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేను బౌలింగ్ చేసి ఉంటే, వాళ్లు 40కే ఆలౌట్ అయ్యేవాళ్లు...ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ...

నేను బౌలింగ్ చేసి ఉంటే, వాళ్లు 40కే ఆలౌట్ అయ్యేవాళ్లు...ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ...

ఇప్పుడంటే బౌలింగ్ చేయడం మానేశారు కానీ ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్‌ కూడా చేసేవాళ్లు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వికెట్ తీసిన భారత ఆఖరి బౌలర్ విరాట్ కోహ్లీయే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 15 2023, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
PTI Photo)(PTI05_14_2023_000215B)

PTI Photo)(PTI05_14_2023_000215B)

తాజాగా ఐపీఎల్ 2023 సీజన్‌లో డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్‌ని 59 పరుగులకి ఆలౌట్ చేసింది. 112 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చింది..

26
Virat Kohli

Virat Kohli

ఈ మ్యాచ్ విజయం తర్వాత ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో జోష్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ, ‘నేను బౌలింగ్ చేసి ఉంటే వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవాళ్లు...’ అంటూ నవ్వుతూ చెప్పాడు.. 

36

అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వికెట్లు తీసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టాడు. 2016 సీజన్‌లో చివరిగా బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఆల్బీ మోర్కెల్ దెబ్బకి ఐపీఎల్‌లో తరుచుగా బౌలింగ్ చేయడం మానేశాడు. 

46

2012లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి 2 ఓవర్లలో సీఎస్‌కే విజయానికి 43 పరుగులు కావాల్సి వచ్చాయి..

56

ఈ దశలో అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ డానియల్ విటోరీ, విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు ఆల్బీ మోర్కెల్.. ఈ ఓవర్‌తో ఆఖరి ఓవర్‌లో 15 పరుగులే కావాల్సిన స్థితికి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఈజీ విక్టరీ అందుకుంది..

66
Image credit: PTI

Image credit: PTI

అంతకుముందు 2008 నుంచి 2012 వరకూ ప్రతీ సీజన్‌లో బౌలింగ్ చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, ఆల్బీ మోర్కెల్ దెబ్బకు 2013, 2014 సీజన్లలో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. 2015లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ, 2016లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు..
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
టీ20 ప్రపంచకప్ ముందే పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ టోర్నీకి దూరం.!
Recommended image2
ఒక్కడి కోసం.. ఆ ఇద్దరిని టెస్టుల నుంచి తప్పించారా..? ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న
Recommended image3
టెస్టు జట్టులోకి పాండ్యా రీఎంట్రీ.? ఆ ఊహ ఎంత బాగుందో కదా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved