- Home
- Sports
- Cricket
- నా కొడుకు ఆడడం ఇంతవరకూ చూడలేదు... అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ ఎంట్రీపై సచిన్ ఎమోషనల్...
నా కొడుకు ఆడడం ఇంతవరకూ చూడలేదు... అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ ఎంట్రీపై సచిన్ ఎమోషనల్...
ఏ తండ్రికైనా పుత్రోత్సాహాన్ని మించిన ఆనందం ఏముంటుంది? తాను శిఖరాలు అధిరోహించిన చోటే, కొడుకు బుడి బుడి అడుగులు వేస్తుంటే చూసి సంతోషంతో మురిసిపోతాడు తండ్రి. క్రికెట్ వరల్డ్‌లో దేవుడిగా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్ కూడా ఇదే ఆనందంలో మునిగిపోతున్నాడు...

Image credit: PTI
2021 ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆ సీజన్‌లో ఆఖరిగా వేలానికి వచ్చిన ప్లేయర్ అర్జున్ టెండూల్కరే. బుల్లి టెండూల్కర్ పేరు వేలంలో రావడం, ముంబై బిడ్ వేయడం, వేలం ముగియడం క్షణాల్లో జరిగిపోయాయి..
Image credit: PTI
2022 మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్‌ని తిరిగి దక్కించుకుంది ముంబై ఇండియన్స్. ఈసారి కూడా అర్జున్ ఆఖర్లో వేలానికి వచ్చాడు. అంకుల్ ఆశీష్ నెహ్రా చాకచక్యంగా వ్యవహరించి అర్జున్ కోసం బిడ్ వేయడంతో అతని ధర, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు చేరింది..
టెండూల్కర్ కొడుకైనా ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడేందుకు రెండు సీజన్లపాటు ఎదురుచూశాడు అర్జున్. అతన్ని రాటు తేల్చి, మళ్లీ మళ్లీ సానబెట్టి ఎట్టకేలకు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేయించింది ముంబై ఇండియన్స్... అర్జున్‌తో ఏకంగా మొదటి ఓవర్ వేయించింది...
Image credit: PTI
రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, ఆ తర్వాత బౌలింగ్‌కి రాలేదు, ఫీల్డింగ్‌లోనూ కనిపించలేదు. అర్జున్ టెండూల్కర్‌ని ఎక్కువగా శ్రమ పెట్టించడం ఇష్టం లేకనో, లేక అతను క్యాచ్ డ్రాప్ చేస్తే ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుందనే అతన్ని సైడ్ చేసేసింది ముంబై ఇండియన్స్...
‘ఇది నాకు చాలా కొత్త అనుభూతి. అర్జున్ టెండూల్కర్ ఆడుతున్నప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అతను స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని మాత్రమే కోరుకుంటున్నా. అతనేం చేయాలనుకుంటున్నాడో అది చేయొచ్చు. ఈరోజు కూడా నేను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నా...
ఎందుకంటే సడెన్‌గా నన్ను బిగ్‌స్క్రిన్ మీద చూస్తే, అర్జున్ టెండూల్కర్ తన ప్లాన్స్ మార్చుకోవచ్చు. నాన్న చూస్తున్నాడని కంగారుపడవచ్చు. నీ అద్భుతమైన క్రికెట్ జర్నీకి ఇది ఆరంభం. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్...’ అంటూ ఎమోషనల్ మెసేజ్ రాసుకొచ్చి, కొడుకుతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు సచిన్ టెండూల్కర్...
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా తమ్ముడు అర్జున్ ఐపీఎల్ ఆరంగ్రేటంపై స్పందించింది. ఐపీఎల్ వేలంలో అర్జున్ అమ్ముడుపోయినప్పుడుల్లా... ‘గర్వపడుతున్నా’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీలు పెట్టిన సారా టెండూల్కర్, అర్జున్ ముంబై క్యాప్ అందుకుంటున్న వీడియోను షేర్ చేసి.. ‘హ్యాపీ సిస్టర్ టుడే’ (అక్కగా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా..) అంటూ కాప్షన్ జోడించింది..
Arjun Tendulkar
‘2008 నుంచి నేను సపోర్ట్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌కి ఆడడం అద్భుతంగా ఉంది. టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ క్యాప్ అందుకోవడం చాలా స్పెషల్..’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు అర్జున్ టెండూల్కర్..