రోహిత్ శర్మ బ్యాటింగ్ నాకేం నచ్చడం లేదు! కాస్త ఓపిగ్గా ఉంటే... - వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి, రెండో క్వాలిఫైయర్‌కి దూసుకొచ్చింది ముంబై ఇండియన్స్. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ లేకపోయినా ముంబై ఇక్కడిదాకా వచ్చిందంటే దానికి రోహిత్ శర్మ కెప్టెన్సీయే కారణం...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma
ఐపీఎల్ 2023 సీజన్‌లో బ్యాటుతో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు రోహిత్ శర్మ. 15 మ్యాచుల్లో 21.60 యావరేజ్‌తో 324 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
Rohit Sharma
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అంతకుముందు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు రోహిత్ శర్మ...
PTI Photo/R Senthil Kumar)(PTI05_24_2023_000315B)
‘ఈ సీజన్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ నాకేమీ నచ్చడం లేదు. అతను భారీ షాట్లు ఆడేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా సిక్సర్లు కొట్టగల చాలా తక్కువ మంది ప్లేయర్లలో రోహిత్ ఒకడు...
అయితే రోహిత్ శర్మ కాస్త ఓపిక చూపించి, ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు, మూడు ఓవర్లు రోహిత్ క్రీజులో ఉంటే భారీ షాట్లు ఆడగలడు, భారీ స్కోరు చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
Rohit Sharma
‘రోహిత్ శర్మ తీసుకునే నిర్ణయాలు నాకు కొన్నిసార్లు వింతగా అనిపించాయి. మార్కస్ స్టోయినిస్ లాంటి హిట్టర్ క్రీజులో ఉన్నప్పుడు హృతిక్ షోకీన్‌ని బౌలింగ్‌కి తీసుకొచ్చాడు...
షోకీన్‌కి అనుభవం లేదు. స్టోయినిస్, అలాంటి బౌలర్‌ని టార్గెట్ చేయాలని అనుకుంటాడు. ఈ విషయం రోహిత్‌కి తెలియనిది కాదు, అయినా అతనితోనే వేయించాడు. షోకీన్ కంటే పియూష్ చావ్లాకి బౌలింగ్ ఇచ్చి ఉండొచ్చు కదా...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..