MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2023 Playoffs: ప్లేఆఫ్స్ షెడ్యూల్.. ఎవరితో ఎవరు..? వివరాలివే

IPL 2023 Playoffs: ప్లేఆఫ్స్ షెడ్యూల్.. ఎవరితో ఎవరు..? వివరాలివే

IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16 ముగింపుదశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ మ్యాచ్ లు ముగిసి ప్లేఆఫ్స్ కు రంగం సిద్ధమైంది. 

2 Min read
Author : Srinivas M
Published : May 22 2023, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

సుమారు రెండు నెలలుగా   దేశంలోని పది నగరాల్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 వ ఎడిషన్  లో  లీగ్ స్టేజ్ ముగిసింది.   ఆదివారం ముంబై ఇండియన్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మధ్య  జరిగిన మ్యాచ్ లతో లీగ్ దశ ముగిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

ఆదివారం రాత్రి వరకూ ప్లేఆఫ్స్ లో నాలుగో స్థానం కోసం  రెండు జట్ల (ముంబై, బెంగళూరు) మధ్య  తీవ్ర పోటీ నెలకొనగా.. గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కు లైన్ క్లీయర్ అయింది. ఇక  రేపటి నుంచి  ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ సమరం మొదలుకానుంది. 

36

ప్లేఆఫ్స్ లో భాగంగా ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ మే 23 (మంగళవారం)న  గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  చెన్నైలోని చెపాక్ వేదికగా  మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది.  ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 

46

మే 24న ఎలిమినేటర్  మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా  చెపాక్ లోనే జరుగుతుంది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ లు తలపడతాయి.  ఎలిమినేటర్  మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫస్ట్ క్వాలిఫయర్   లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఎలిమినేటర్ లో ఓడిన జట్టు  బ్యాగ్ సర్దుకోవడమే. 

56

మే 26న  ఎలిమినేటర్ విజేత, ఫస్ట్ క్వాలిఫయర్ లో ఓడిన జట్ల  మధ్య  అహ్మదాబాద్ వేదికగా   రెండో క్వాలిఫయర్ జరుగుతుంది.  ఈ రెండు జట్ల  మధ్య గెలిచిన జట్టు ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. 

66
Image credit: Sandeep Rana

Image credit: Sandeep Rana

ఇక మే 28న క్వాలిఫయర్ -1 విజేత, క్వాలిఫయర్ - 2 విజేత ల మధ్య  అహ్మదాబాద్ వేదికగా  వచ్చే ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి  తుది పోరు జరుగుతుంది.  ఈ మ్యాచ్  తో ఐపీఎల్ - 16 సీజన్ కు ఎండ్ కార్డ్ పడుతుంది.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?
Recommended image2
Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్
Recommended image3
Vaibhav Suryavanshi: కల నిజమైంది.. టీమిండియా ‘త్రీ స్టార్’ జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved