- Home
- Sports
- Cricket
- హారీ బ్రూక్‌కి ఆ వీక్‌నెస్ ఉంది, కానీ భలే తెలివిగా దాస్తున్నాడు... హర్భజన్ సింగ్ కామెంట్...
హారీ బ్రూక్‌కి ఆ వీక్‌నెస్ ఉంది, కానీ భలే తెలివిగా దాస్తున్నాడు... హర్భజన్ సింగ్ కామెంట్...
ఐపీఎల్ 2023 వేలంలో రూ.13.25 కోట్లకు హారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి 3 మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన హారీ బ్రూక్, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి అదరగొట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో నమోదైన మొదటి సెంచరీ ఇది..

Harry Brook
మొదటి మూడు మ్యాచుల్లో రెండు సార్లు 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు హారీ బ్రూక్. తనను రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో కోటికో పరుగు చెప్పున మాత్రమే లెక్కేసి కొడుతున్నాడని హారీ బ్రూక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొదటి సారి 13 పరుగుల మార్కును దాటిన హారీ బ్రూక్, ఎక్కడా ఆగకుండా అజేయ సెంచరీ చేశాడు..
Image credit: PTI
55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన హారీ బ్రూక్, అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో 4 సెంచరీలు చేసి సంచలన ఆరంభం దక్కించుకున్నాడు. హారీ బ్రూక్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్...
Image credit: PTI
‘హారీ బ్రూక్ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో చాలా బాగా ఆడుతున్నాడు. పేస్ బౌలింగ్‌లో ఆడేందుకు అతని అమ్ములపొదిలో చాలా రకాల షాట్స్ ఉన్నాయి. అయితే స్పిన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడంలో మాత్రం అతను గొప్ప బ్యాటర్ కాదు. స్పిన్నర్లను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు కూడా..
స్పిన్నర్లు బౌలింగ్‌కి వచ్చినప్పుడు వారికి దొరకకుండా ఉండేందుకు సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేస్తున్నాడు. అతను ఆడిన షాట్స్‌లో దాదాపు అన్నీ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో వచ్చినవే. హారీ బ్రూక్ స్పిన్ వీక్‌నెస్ గురించి మిగిలిన సన్‌రైజర్స్ బ్యాటర్లకు బాగా తెలిసినట్టుంది...
హారీ బ్రూక్ స్పిన్ బౌలర్లను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడతాడని తెలిసి, వాళ్లే ఎక్కువగా స్ట్రైయిక్ తీసుకుంటున్నారు. బ్రూక్ ఫాస్ట్ బౌలర్ల బౌండరీలు బాదితే, అయిడిన్ మార్క్‌రమ్, అభిషేక్ వర్మ స్పిన్ బౌలర్లను ఎక్కువగా ఫేస్ చేశారు. ఏ బ్యాటర్‌కి అయినా ఇలాంటి సపోర్ట్ దక్కాలి.. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ముంబై ఇండియన్స్ వరుసగా రెండు విజయాలు అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చింది. హారీ బ్రూక్‌ని వాళ్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. సెంచరీ తర్వాత వచ్చిన అంచనాలను అందుకోవడం చాలా కష్టం. ఈ సవాల్‌ని హారీ అధిగమిస్తే, అతను గొప్ప బ్యాటర్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..