- Home
- Sports
- Cricket
- నీకుంది.. నీకుంది.. అది కన్ఫామ్..!! కోహ్లీ ఫ్యాన్స్‌ను మళ్లీ గెలికిన నవీన్ ఉల్ హక్..
నీకుంది.. నీకుంది.. అది కన్ఫామ్..!! కోహ్లీ ఫ్యాన్స్‌ను మళ్లీ గెలికిన నవీన్ ఉల్ హక్..
IPL 2023: ఐపీఎల్ - 16 లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ కంటే ఫుల్ ఫేమస్ అయింది కోహ్లీ - నవీన్ ఉల్ హక్ వాగ్వాదం. దీని తర్వాత సోషల్ మీడియాలో ఈ ఆప్గాన్ బౌలర్ చేసిన పోస్టులు కోహ్లీ ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పించాయి.

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఆడినా ఆడకున్నా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ అఫ్గాన్ పేసర్ ఏ క్షణాన విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడో గానీ ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి ఇప్పుడు అతడు ఎక్కడికెళ్లినా విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తున్నది.
తాజాగా లక్న జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇది మరోసిరి ప్రూవ్ అయింది. ఈ మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్ చేసేప్పుడు ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు ‘కోహ్లీ కోహ్లీ’ అంటూ నినదించారు. ఇది అతడిలో మరింత అసహనాన్ని కలిగించింది.
అయితే నవీన్ ఉల్ హక్ కూడా ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు. తనను టీజ్ చేసిన ఫ్యాన్స్ కు ‘నోర్మూసుకోండి’ అంటూ కోహ్లీ, గంభీర్ ల స్టైల్ లో వారికి సైగ చేస్తూ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టాడు.
కేకేఆర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ ఇచ్చిన క్యాచ్ ను రవి బిష్ణోయ్ అందుకున్న తర్వాత నవీన్ ఉల్ హక్.. ఫ్యాన్స్ వైపునకు తిరుగుతూ.. ‘నోర్మూసుకోండి’ అంటూ సైగ చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా నవీన్ ఉల్ హక్ నిన్నటి మ్యాచ్ లో 19 వ ఓవర్ వేసి వేసి 20 పరుగులు ఇవ్వడంతో అతడి తిక్క కుదిరిందని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రింకూ సింగ్ నవీన్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్స్ తో పాటు ఓ సిక్స్ కూడా కొట్టి 20 పరుగులు రాబట్టాడు. మొత్తంగా నిన్నటి మ్యాచ్ లో అతడు 4 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చాడు.
అయితే కోహ్లీ స్టైల్ లో నవీన్ చేసిన పనితో కోహ్లీ ఫ్యాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ నేడు ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకున్న తర్వాత ఎలిమినేటర్ లో లక్నోతో ఆడాల్సి ఉంటుందని.. అప్పుడు నవీన్ కు కోహ్లీ చేతిలో ఉందని.. గత మ్యాచ్ లో అయినా జాలితో వదిలిపెట్టాడేమో గానీ ఇప్పుడు మాత్రం అస్సలే వదలడని కామెంట్స్ చేస్తున్నారు.