- Home
- Sports
- Cricket
- ఫైనల్‌కి ముందు సీఎస్‌కేకి ఊహించని షాక్... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సస్పెన్సన్ వేటు!
ఫైనల్‌కి ముందు సీఎస్‌కేకి ఊహించని షాక్... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సస్పెన్సన్ వేటు!
ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఫైనల్‌కి దూసుకెళ్లింది. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 2023 సీజన్‌లో ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది. గ్రూప్ స్టేజీలో రెండో స్థానంలో నిలిచిన సీఎస్‌కే, మొదటి క్వాలిఫైయర్‌లో టైటాన్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే, అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తూ ఐదో టైటిల్ కైవసం చేసుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్...
అయితే ఫైనల్ మ్యాచ్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కి ఊహించని షాక్ తగిలేలా కనబడుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించినా, షెడ్యూల్ సమయం కంటే రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ వేసింది సీఎస్‌కే...
Dhoni vs Jadeja
ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు సార్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాలు చెల్లించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో మూడోసారి తప్పు రిపీట్ చేయడంతో ధోనీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి..
స్ట్రాటెజిక్ టైమ్ సమయంలో ఫీల్డ్ బయటికి వెళ్లిన మతీశ పథిరాణాతో బౌలింగ్ చేయించేందుకు వీలుగా 4 నిమిషాల విలువైన సమయాన్ని వృథా చేస్తూ, అంపైర్లతో ఈ విషయం గురించి చర్చించాడు ధోనీ. ఇదే ఇప్పుడు ధోనీపై బ్యాన్ పడే ప్రమాదంలో పడేసింది..
ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ బౌలర్ అయినా ఫీల్డ్ వదిలి బయటికి వెళితే, రాగానే బౌలింగ్ చేయడానికి వీల్లేదు. బౌలింగ్ చేయడానికి ముందు కనీసం 4 నిమిషాల పాటు ఫీల్డ్‌లో గడపాల్సి ఉంటుంది. పథిరాణా వచ్చిన తర్వాత అతనికి బౌలింగ్ ఇచ్చిన ధోనీ, అంపైర్లతో ఈ విషయం గురించి 4 నిమిషాలు చర్చ పెట్టుకున్నాడు..
Dhoni
పుణ్యకాలం అంతా గడిచిపోవడంతో అనుకున్నట్టుగానే పథిరాణా బౌలింగ్ చేయడం జరిగిపోయింది. ధోనీ కావాలని సమయాన్ని వృథా చేస్తున్నా ఫీల్డ్ అంపైర్లు నవ్వుతూ ఉండిపోయారు కానీ మాహీపైన యాక్షన్ తీసుకునే ధైర్యం చేయలేకపోయారు...
Dhoni
ఆఖరి మ్యాచ్‌లో ధోనీపై బ్యాన్ పడితే ఆ ఎఫెక్ట్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రంగా పడుతుంది. ధోనీ చెప్పినట్టుగా బౌలింగ్ చేసే దీపక్ చాహార్, పథిరాణా వంటి బౌలర్లు, కెప్టెన్ క్రీజులో లేకపోతే నూరు శాతం రాణించగలరా? అనేది చెప్పడం కష్టమే..