MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీతో ఆడితే ఆ మాత్రం ఉంటది... సంగర్కర, జయవర్థనే, మలింగలను వెనక్కి నెట్టిన మతీశ పథిరాణా...

ధోనీతో ఆడితే ఆ మాత్రం ఉంటది... సంగర్కర, జయవర్థనే, మలింగలను వెనక్కి నెట్టిన మతీశ పథిరాణా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుని 9వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి టాప్ 2లో నిలిచి గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడనుంది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 21 2023, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
dhoni pathirana

dhoni pathirana

అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్ తీవ్రంగా నిరాశపరిచినా 20 ఏళ్ల శ్రీలంక యంగ్ బౌలర్ మతీశ పథిరాణా అద్బుత బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

2023 సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన మతీశ పథిరాణా, 7.57 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్‌గా మారాడు పథిరాణా..

37
Image credit: PTI

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మతీశ పథిరాణా, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకున్న శ్రీలంక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.. పథిరాణాకి ప్రస్తుతం ఇన్‌స్టాలో 446 వేల ఫాలోవర్లు ఉన్నారు...
 

47

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కరకి 348 వేల ఫాలోవర్లు ఉండగా, మరో మాజీ సారథి మహేళ జయవర్థనేకి 327 వేల ఫాలోవర్లు ఉన్నారు. లంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగకి 317 వేల ఫాలోవర్లు ఉన్నారు..

57
Image credit: PTI

Image credit: PTI

ఈ ముగ్గురినీ వెనక్కి నెట్టిన మతీశ పథిరాణా, ఆర్‌సీబీ తరుపున ఆడుతున్న ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగ 386 వేల ఫాలోవర్ల రికార్డును కూడా అధిగమించి టాప్‌లో నిలిచాడు. 

67

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు 90 వేల కంటే తక్కువగా ఉన్న పథిరాణా ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య, నెలన్నరలో 3 వందల రెట్లు పెరగడం విశేషం.. 

77

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు అందుకున్న మతీశ పథిరాణా, శ్రీలంక జట్టుకి ఫ్యూచర్ మలింగ అవుతాడని ఆశలు రేపుతున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
World Cup 2027: కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు.. మరి రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి? గంభీర్ సీక్రెట్ స్కెచ్
Recommended image2
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?
Recommended image3
అభిమానుల‌కు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్‌.. అయినా అసంతృప్తిగా ఉంద‌న్న గంభీర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved