- Home
- Sports
- Cricket
- కోట్లు పెట్టి కొంటే నిలువునా ముంచేశారు! మొదటి మ్యాచ్‌లో కాస్ట్ లీ ప్లేయర్లు అంతా ఫెయిల్...
కోట్లు పెట్టి కొంటే నిలువునా ముంచేశారు! మొదటి మ్యాచ్‌లో కాస్ట్ లీ ప్లేయర్లు అంతా ఫెయిల్...
ఐపీఎల్ 2023 మినీ వేలం, ఇంతకుముందున్న రికార్డులన్నీ తుడిచి పెట్టేసింది. ఫారిన్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. వేలంలో రికార్డు ధర దక్కించుకున్న టాప్ ప్లేయర్లు అందరూ కూడా ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన తొలి మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు...

Sam Curran
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌ని రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చిన సామ్ కుర్రాన్, ఒకే ఒక్క వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...
Cameron Green
ఐపీఎల్ 2022 సీజన్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్‌తో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ని వేలంలో రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చిన కామెరూన్ గ్రీన్ ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 4 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని ఏకంగా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. బ్యాటింగ్‌లో 6 బంతుల్లో 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు బెన్ స్టోక్స్. ఇన్నింగ్స్ ఆరంభంలో బెన్ స్టోక్స్ బంతి పట్టుకుని కనిపించాడు...
బెన్ స్టోక్స్‌తో మొదటి ఓవర్ వేయించబోతున్నారేమోనని అందరూ ఆశించారు. అయితే ఆట ప్రారంభమయ్యే సమయానికి తెరపైకి దీపక్ చాహార్ వచ్చాడు. రూ.16.25 కోట్లు తీసుకున్న బెన్ స్టోక్స్, ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం విశేషం...
Image: PTI
ఐపీఎల్‌లో నికోలస్ పూరన్‌ని ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చిన నికోలస్ పూరన్‌ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏకంగా రూ.16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు నికోలస్ పూరన్. నిజానికి ఐపీఎల్‌లో పూరన్‌పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. కాబట్టి అతనికి పెట్టిన డబ్బుకి, ఆడిన ఆటకు సంబంధం లేకపోయినా మిగిలిన వాళ్లతో, గత సీజన్లతో పోలిస్తే పూరన్ చాలా బెటర్...
ఐపీఎల్ 2023 మినీ వేలంలో హారీ బ్రూక్‌ని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్కేసి మరీ కొట్టాడు హారీ బ్రూక్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతులు ఆడి 13 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు బ్రూక్...
ఒక్క మ్యాచ్‌తో ఆటగాళ్ల పర్ఫామెన్స్‌ని ఓ అంచనా వేయడం కరెక్ట్ కాదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా, భారీ ప్రైజ్ ట్యాగ్‌ని మెడలో వేసుకుని వచ్చిన ఈ ప్లేయర్లు, సీజన్‌లో మంచి ఆరంభాన్ని అయితే దక్కించుకోలేకపోయారు. ఇందులో ఎవరు క్లిక్ అవుతారో? ఎవరు డిజాస్టర్‌గా మిగులుతారో తెలియాలంటే ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే.