- Home
- Sports
- Cricket
- పంత్ రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్.. మరి ఆ ముంబై బ్యాటర్ పరిస్థితేంటి..?
పంత్ రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్.. మరి ఆ ముంబై బ్యాటర్ పరిస్థితేంటి..?
IPL 2023: మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండనున్నాడు.

ఐపీఎల్ ప్రారంభానికి రెండ్రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ స్థానంలో రిప్లేస్మెంట్ ను ప్రకటించింది.
పంత్ స్థానంలో బెంగాల్ కుర్రాడు.. గతేడాది అండర్ - 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న అభిషేకక్ పొరెల్ ను జట్టులోకి తీసుకుంది. బెంగాల్ కు చెందిన ఈ 20 ఏండ్ల కుర్రాడు.. పంత్ మాదిరిగానే వికెట్ కీపింగ్ తో పాటు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా.
కాగా పంత్ కు గాయం నేపథ్యంలో ఢిల్లీ సారథిగా డేవిడ్ వార్నర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ కు అతడికి డిప్యూటీగా ఉండనున్నాడు. పేపర్ మీద బలంగానే ఉన్న ఢిల్లీ ఈసారి వికెట్ కీపర్ గా ఎవర్ని ఆడిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
రిషభ్ ప్లేస్ లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు అప్పజెప్పుతారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సర్ఫరాజ్ ఖాన్ గత కొన్నాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ క్యాంప్ లో బ్యాటింగ్ కంటే ఎక్కువగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
సుమారు నెలన్నరగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఉండగా మరి అభిషేక్ ను తీసుకుని ఏం చేస్తారు..? అనేది ప్రశ్నార్థకం. అయితే మిగతా జట్ల మాదిరిగా ఢిల్లీకి సబ్ స్టిట్యూట్ వికెట్ కీపర్లు లేరు. పంత్ ఉన్నన్నిరోజులూ అతడే జట్టుకు కీపింగ్ బాధ్యతలు చూసుకునేవాడు. కానీ పంత్ లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ తాత్కాలిక వికెట్ కీపర్ గా అభిషక్ అతడికి సబ్ స్టిట్యూట్ గా ఉంటాడు.
ఢిల్లీ జట్టు : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, రొవ్మన్ పావెల్, రిలీ రూసో, ఫిల్ సాల్ట్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, రిపల్ పటేల్, మిచెల్ మార్ష్, అన్రిచ్ నోర్త్జ్, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, ప్రవీణ్ దూబే, కమ్లేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అమన్ ఖాన్, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్