MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ఇలాంటి ఆట అంటే అబ్బో మామూలు విషయం కాదు... ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌పై..

బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ఇలాంటి ఆట అంటే అబ్బో మామూలు విషయం కాదు... ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌పై..

ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ముంబై ఇండియన్స్. జస్ప్రిత్ బుమ్రా తప్ప మరో స్టార్ బౌలర్ లేకపోవడం ముంబై ఇండియన్స్‌ని బాగా ఇబ్బంది పెట్టింది. ఈసారి అతను కూడా గాయపడడంతో ముంబైకి మరోసారి ఆఖరి ప్లేస్ ఖాయమనుకున్నారంతా.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 13 2023, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

అనుకున్నట్టుగానే మొదటి 10 మ్యాచుల్లో 5 పరాజయాలను అందుకుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం, భారీ అంచనాలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ ఆడిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ కావడం, గాయంతో సీజన్ నుంచి దూరం కావడంతో ముంబై ఈసారి కూడా అస్సామే అనుకున్నారంతా..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI


అయితే ఊహించని విధంగా వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది రోహిత్ సేన. ముంబై బౌలర్లు వరుసగా 4 మ్యాచుల్లో 200+ స్కోరు అందించారు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 199 పరుగులు సమర్పించేశారు. అయితే బౌలింగ్‌ వీక్‌గా ఉంటే, బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉండడంతో ముంబై ఇండియన్స్.. టాప్ 3లోకి దూసుకొచ్చింది..

36
(PTI Photo/Kunal Patil) (PTI05_09_2023_000386B)

(PTI Photo/Kunal Patil) (PTI05_09_2023_000386B)

రూ.17.5 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్‌తో పాటు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ల కంటే బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో టీమ్‌లోకి వచ్చిన కుర్రాళ్లు, అదిరిపోయే ఆటతీరుతో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు..
 

46
Image credit: PTI

Image credit: PTI

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన విష్ణు వినోద్, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఆకాశ్ మద్వాల్, 3 ఓవర్లలో 2 వికెట్లు తీసిన కుమార్ కార్తీకేయ, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ సాధించిన నేహాల్ వదేరా... ఈ నలుగురు కూడా బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ముంబై టీమ్‌లోకి వచ్చినవాళ్లే..

56
vishnu vinod catch

vishnu vinod catch

హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కేవలం స్టార్ ప్లేయర్లనే కొనుగోలు చేస్తుందని కామెంట్ చేసిన తర్వాత అతని టీమ్‌ని బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ఓడించి, అదిరిపోయే బదులు ఇచ్చాడు రోహిత్ శర్మ.. ఇప్పటిదాకా చాలామంది రోహిత్ శర్మకు మంచి టీమ్ దొరకడం వల్లే సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అవుతూ వచ్చాడని విమర్శలు చేశారు..

66
tiago ev nehal

tiago ev nehal

అయితే ఈ సారి టీమ్‌లో ఒక్క స్టార్ బౌలర్ కూడా లేకుండా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరితే... రోహిత్ శర్మ ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చినట్టే అవుతుంది. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Recommended image3
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved