- Home
- Sports
- Cricket
- బ్యాటర్ల కోసం రూల్స్ అన్నీ మారుస్తున్నారు! ఇక మేం ఏం చేయాలి... ఇషాంత్ శర్మ ఆవేదన...
బ్యాటర్ల కోసం రూల్స్ అన్నీ మారుస్తున్నారు! ఇక మేం ఏం చేయాలి... ఇషాంత్ శర్మ ఆవేదన...
క్రికెట్‌లో బ్యాటుకి ఎంత విలువ ఉంటుందో, బంతికీ అంతే విలువ ఉంటుంది. అయితే టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. బౌలర్లపై బ్యాటర్ల ఆధిక్యం పెరిగిపోయింది. ఆటకు క్రేజ్ పెంచేందుకు, పరుగుల వరద పారేందుకు రూల్స్‌ని మారుస్తూనే ఉన్నారు...

Ishant-Sharma DC
2008 ఆరంభ ఐపీఎల్ సీజన్ నుంచి ఆడుతున్న ఇషాంత్ శర్మ, గాయం కారణంగా మధ్యలో ఓ సీజన్‌కి దూరమయ్యాడు. కపిల్ దేవ్ తర్వాత టీమిండియా తరుపున 100 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇషాంత్ శర్మ, గత ఏడాదితో టీమ్‌లో చోటు కోల్పోయాడు...
Ishant Sharma and Virat Kohli
‘టీ20 క్రికెట్ రూల్స్ చాలా మారాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు బ్యాటర్లకు చాలా అవకాశాలు వచ్చాయి. మంచి బ్యాట్లు అందుబాటులో ఉన్నాయి, మంచి బ్యాటింగ్ వికెట్లను తయారు చేస్తున్నారు. బౌండరీల సైజు కూడా తగ్గించేశారు...
జనాలకు కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. బంతి ఎంత దూరం పడితే, అంత కిక్కు. సిక్సర్లను చూడడానికి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాంటప్పుడు బౌలర్లకు అవకాశం ఎక్కడుంటుంది. ఆస్ట్రేలియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ అయినా క్రికెట్‌కి మంచి చేస్తుందని అనుకుంటున్నా...
ఎందుకంటే ఆస్ట్రేలియాలో బౌండరీలు చాలా పెద్దవి. సిక్సర్ బాదాలంటే అంత సులువైన విషయం కాదు. బౌలర్లకు కూడా సమాన అవకాశం దొరుకుతుంది. టీ20 క్రికెట్‌లో సక్సెస్ కావాలంటే పరిస్థితితో సంబంధం లేకుండా నిన్ను నువ్వు నమ్ముకోవాలి...
బ్యాటర్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా యార్కర్ వేసి వికెట్ల తీయగలనని నమ్మితేనే, సక్సెస్ సాధించగలం. చిన్న ఫార్మాట్‌లో బౌలర్లకు ఉండే అవకాశాలే తక్కువ. వచ్చిన వాటిని ఒడిసి పట్టుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ...