- Home
- Sports
- Cricket
- ఆ కుర్రాడిని ఇక ఆడించరా! బేబీ ఏబీడీ అన్నారు, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ... ముంబై ఇండియన్స్‌కి...
ఆ కుర్రాడిని ఇక ఆడించరా! బేబీ ఏబీడీ అన్నారు, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ... ముంబై ఇండియన్స్‌కి...
ఐపీఎల్‌లో క్రిస్ లీన్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్ ప్లేయర్లను రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన ముంబై ఇండియన్స్, ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించే ప్లేయర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది...

Dewald Brevis
గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ నుంచి దాదాపు అరడజను మంది కొత్త ప్లేయర్లు, ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశారు. గత సీజన్‌లో కుమార కార్తీకేయ, తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, రమణ్‌దీప్ సింగ్, డేవాల్డ్ బ్రేవిస్ వంటి కుర్రాళ్లు ఐపీఎల్ ఆరంగ్రేటం చేశారు...
(PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000352B)
ఈ సీజన్‌లో నేహాల్ వదేరా, ఆకాశ్ మద్వాల్, అర్జున్ టెండూల్కర్ వంటి కొత్త కుర్రాళ్లను ఐపీఎల్‌లో ఆడించింది ముంబై ఇండియన్స్. సచిన్ వారసుడిగా టీమ్‌లోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్, పెద్దగా మెప్పించలేక తుదిజట్టులో చోటు కోల్పోయాడు..
Dewald Brevis
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన డేవాల్డ్ బ్రేవిస్, 7 మ్యాచుల్లో 142.48 స్ట్రైయిక్ రేటుతో 161 పరుగులు చేసి మెప్పించాడు. బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీశాడు. అయితే అతనికి ఈ సీజన్‌లో ఇప్పటిదాకా తుది జట్టులో చోటు దక్కలేదు...
Dewald Brevis
గ్రౌండ్‌కి అన్ని వైపులా షాట్స్ ఆడుతూ, ‘బేబీ ఏబీడీ’గా గుర్తింపు తెచ్చుకున్న డేవాల్డ్ బ్రేవిస్, ఈ సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం అత్యంత వీక్‌గా తయారైంది.
జస్ప్రిత్ బుమ్రా గాయంతో సీజన్‌కి దూరం కావడం, జోఫ్రా ఆర్చర్ రిథమ్ అందుకోవడానికి అష్టకష్టాలు పడుతుండడంతో వరుసగా 4 మ్యాచుల్లో ముంబై బౌలర్లు 200+ ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆల్‌రౌండర్ల అవసరం చాలా ఉంది..
Image credit: Getty
కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్ తప్ప మరో ఫారిన్ ప్లేయర్‌కి తుది జట్టులో అన్ని మ్యాచుల్లో చోటు ఉండడం లేదు. కొన్ని మ్యాచుల్లో జాసన్ బెహ్రాడార్ఫ్, ఇంకొన్ని మ్యాచుల్లో రిలే మెడరిత్ తుది జట్టులోకి రాగా, ట్రిస్టన్ స్టబ్స్ రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు.
కాబట్టి డేవాల్డ్ బ్రేవిస్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి రోహిత్ శర్మ మనసులో ఏముందో, డేవాల్డ్ బ్రేవిస్‌ని ఎందుకు ఆడించడం లేదనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం.