- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మకు ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లో 60 అడుగుల భారీ కటౌట్... సినిమా సెంటర్‌లో హిట్ మ్యాన్‌కి...
రోహిత్ శర్మకు ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లో 60 అడుగుల భారీ కటౌట్... సినిమా సెంటర్‌లో హిట్ మ్యాన్‌కి...
హీరోలకు భారీ కటౌట్లు పెట్టడం అభిమానులకు అదో తృప్తి. ఎంత పెద్ద భారీ కటౌట్ పెడితే, ఆ హీరో ఇమేజ్ అంత ఉందని వాళ్లకి వాళ్లు ఫీలైపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ పిచ్చి, అభిమానం క్రికెటర్లను కూడా తాకింది. రోహిత్ శర్మ కోసం హైదరాబాద్‌లో భారీ కటౌట్ పెడుతున్నారు అభిమానులు...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్ల గ్యాప్‌లో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, అంతకుముందు డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్, సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు..
టీమిండియా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు...
రోహిత్ శర్మ పుట్టినరోజు ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు ఏరియాలో 60 అడుగుల భారీ కటౌట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు అభిమానులు. భారత్‌లో ఓ క్రికెటర్‌కి ఇంత భారీ కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి...
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన తర్వాత బ్యాటు లేపి సెలబ్రేట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఇదే ఫోజుని భారీ కటౌట్‌గా మలచబోతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ, తన పుట్టినరోజున రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడబోతున్నాడు...
టీ20 ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ రెండు టోర్నీల్లో టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి...
Image credit: PTI
ఐపీఎల్‌లో 6 వేల పరుగుల క్లబ్‌లో చేరిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 250 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచారు...