శుబ్‌మన్ గిల్‌కి చెప్పు చూపించిన యువరాజ్ సింగ్... నీ షాట్స్ చాలా బాగున్నాయంటూనే...
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో 80+ పరుగులు చేసి మెప్పించిన శుబ్‌మన్ గిల్... ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. గత సీజన్లలో కేకేఆర్‌కి ఆడిన శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో వేలానికి ముందే కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన శుబ్‌మన్ గిల్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఐపీఎల్ బెస్ట్ స్కోరు నమోదు చేశాడు...
Shubman Gill
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఐపీఎల్‌తో తన బెస్ట్ స్కోరును మరింత మెరుగుపర్చుకున్నాడు. అయితే ఆ తర్వాతే శుబ్‌మన్ గిల్ బ్యాటు నుంచి మెరుపులు రాలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
Shubhman Gill
రెండు మ్యాచుల్లో కలిపి 180 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 8 మ్యాచుల్లో కలిపి 229 పరుగులే చేశాడు. అంటే మిగిలిన 6 మ్యాచుల్లో కలిపి చేసింది 49 పరుగులు మాత్రమే... ఇందులో రెండు సార్లు డకౌట్ కూడా...
తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. దీంతో ‘ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే గుజరాత్ టైటాన్స్‌కి ఫోన్ చేయండి...’ అంటూ పోస్ట్ చేశాడు శుబ్‌మన్ గిల్...
Image Credit: Getty Images
దీనికి స్పందించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... ‘నీ షాట్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది... ’ అంటూ చెప్పు సింబల్‌ని కామెంట్ చేశాడు...
Image Credit: Getty Images
శుబ్‌మన్ గిల్‌కి చెప్పు చూపిస్తున్నట్టు కామెంట్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి కారణం శుబ్‌మన్ గిల్‌కి మెంటర్‌గా వ్యవహరించిన యువరాజ్ సింగ్, అతనికి బ్యాటింగ్ పాఠాలు నేర్పించేవాడు...
ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ అదే స్టైల్‌లో అవుట్ అయినా, మాట వినకపోయినా చెప్పులు తీసుకుని కొట్టేవాడట యువరాజ్ సింగ్. ఇంకోసారి ఇలా అవుట్ అయితే మళ్లీ చెప్పుల దెబ్బలు తప్పవని సింబాలిక్‌గా స్లిప్పర్స్ ఎమోజీని కామెంట్ చేశాడు యువీ...
శుబ్‌మన్ గిల్ ఫెయిల్ అవుతున్నా కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, బౌలింగ్‌లో లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీల కారణంగా వరుస విజయాలు అందుకుంటూ టేబల్ టాపర్‌గా దూసుకుపోతోంది గుజరాత్ టైటాన్స్...