MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: ఇండియాలోనే ఐపీఎల్-15.. వేదికలు ఖరారు.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ అధ్యక్షుడు

IPL 2022: ఇండియాలోనే ఐపీఎల్-15.. వేదికలు ఖరారు.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ అధ్యక్షుడు

BCCI Chief Confirms IPL 2022 Venues: క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 ఎక్కడ జరుగుతుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

2 Min read
Author : Srinivas M
| Updated : Feb 03 2022, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్-2022 ఎక్కడ జరుగుతుంది..?  దేశంలో కరోనా ఉదృతి  నేపథ్యంలో  ఈ క్యాష్ రిచ్ లీగ్ ను  గత రెండు సీజన్ల మాదిరిగానే దుబాయ్ లో నిర్వహిస్తారని గతంలో వార్తలు వినిపించాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దుబాయ్  కంటే తమ దేశంలో ఖర్చులు తక్కువని, తమదగ్గర ఐపీఎల్ నిర్వహించాలని  దక్షిణాఫ్రికా  క్రికెట్ బోర్డు కూడా  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ప్రతిపాదనలు పంపింది.

38

కాగా మరోవైపు  ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహించాలని టీమిండియా అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా బీసీసీఐని కోరారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ  సన్నాహాలు చేస్తున్నదని పలు ఛానెళ్లు కథనాలను ప్రసారం చేశాయి.

48

దీనిపై బీసీసీఐ ఇంతవరకూ  స్పందించలేదు. కానీ  తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తదుపరి ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందని స్పష్టం చేశాడు. ఈ మేరకు వేదికలను కూడా ప్రకటించాడు. 

58

ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో గంగూలీ మాట్లాడుతూ..  ‘కరోనా పరిస్థితి చేయిదాటిపోతే తప్ప ఈసారి ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తాం. గతంలో మేము స్పష్టం చేసిన మాదిరిగానే భారత్ లోనే  ఐపీఎల్ ను నిర్వహించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. 
 

68

మహారాష్ట్ర లోని ముంబై, పూణెలలో మ్యాచులను నిర్వహించాలని భావిస్తున్నాం. లీగ్ మ్యాచులైతే ఇక్కడే నిర్వహిస్తాం. అహ్మదాబాద్ గురించి ఇంకా ఆలోచించలేదు.  ఒకవేళ ఏప్రిల్-మేలలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటి పరిస్థితుల ఆధారంగా  దానిమీద నిర్ణయం తీసుకుంటాం..’ అని గంగూలీ చెప్పాడు.

78

లీగ్ మ్యాచులను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల స్టేడియాలలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మూడు స్టేడియాలతో పాటు పూణె లో కూడా ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నారు

88

ఇక ప్లే ఆఫ్స్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని గతంలో అనుకున్నా.. తాజాగా గంగూలీ  వ్యాఖ్యలు చూస్తే మాత్రం బీసీసీఐ అందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతున్నది.

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image2
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Recommended image3
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved