- Home
- Sports
- Cricket
- డివిలియర్స్ రిటైర్మెంట్ గురించి చెప్పగానే అనుష్క శర్మ రియాక్షన్ ఏంటంటే.. కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు
డివిలియర్స్ రిటైర్మెంట్ గురించి చెప్పగానే అనుష్క శర్మ రియాక్షన్ ఏంటంటే.. కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL2022: సుదీర్ఘకాలం పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ గత సీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం తెలియగానే అనుష్క శర్మ..

పది సీజన్ల పాటు బెంగళూరుతో పాటు ఐపీఎల్ అభిమానులను తన ఆల్ రౌండ్ ఆటతో అలరించిన ఏబీ డివిలియర్స్ గత సీజన్ తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్నాడు.
2011 నుంచి 2021 సీజన్ దాకా ఏబీడీ ఆర్సీబీతోనే ఉన్నాడు. ఈ పదేండ్లలో ఐపీఎల్ లో కోహ్లితో కలిసి చాలా మ్యాచులలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి రికార్డులు నెలకొల్పారు. అయితే డివిలియర్స్ ఆట నుంచి తప్పుకోవడంతో కోహ్లి ఒంటరివాడైనట్టుగా భావించారు ఆర్సీబీ ఫ్యాన్స్.
ఆన్ ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ఫీల్డ్ లో కూడా ఏబీడీ-విరాట్ కోహ్లి లు మంచి స్నేహితులు. ఈ ఇద్దరే గాక వీరి కుటుంబాలు కూడా సన్నిహితంగా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా డివిలియర్స్ భార్య.. అనుష్క శర్మతో కలిసి దిగిన ఫోటోలు కొన్ని అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే డివిలియర్స్ ఆర్సీబీ నుంచి తప్పుకున్నాడనంగానే అభిమానుల మాదిరిగానే అనుష్క శర్మ కూడా షాక్ కు గురైందట.. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లినే వెల్లడించాడు.
ఇటీవలే ఆర్సీబీ విడుదల చేసిన ఓ వీడియోలో కోహ్లి మాట్లాడుతూ.. ‘నాకైతే వింతగా అనిపించింది. అప్పుడు (ఏబీడీ రిటైర్మెంట్ ప్రకటించే ముందు) మేము టీ20 ప్రపంచకప్ అనంతరం దుబాయ్ నుంచి వచ్చేప్పుడు ఏబీడీ నాకు వాయిస్ మెసేజ్ పంపాడు.
నేను దానిని ఓపెన్ చేసి విన్నాను. అప్పుడు అనుష్క శర్మ నా పక్కనే ఉంది. ఆ వాయిస్ నోట్ వినగానే నేను అనుష్క వైపు తిరిగి ఆశ్చర్యంగా చూశాను. ఏమైంది అని తాను అడిగింది. నేను విషయం చెప్పాను.
అప్పుడు అనుష్క నాతో.. నాకేం చెప్పకు.. అని చెప్పింది. ఎందుకంటే ఈ విషయం ఆమెకు ముందే తెలుసు. ఏబీడీ ఈ సీజన్ లోనే తప్పుకుంటాడని తాను గ్రహించానని అనుష్క నాతో అంది...’ అని చెప్పాడు.
ఇదిలాఉండగా.. అనుష్క శర్మ తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఉన్న విరాట్ కోహ్లితో కలిసింది. బయో బబుల్ లో ఆమె కూడా జాయిన్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోను కోహ్లి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
కాగా పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచులో ఓడిన ఆర్సీబీ.. గతేడాది రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొనబోతున్నది. తొలి మ్యాచులో పరాభవాన్ని మరిచి విజయాల బాట పట్టాలని ఆ జట్టు భావిస్తున్నది.