ఐపీఎల్‌లో కనిపించని ఆ హీరోలు... వరల్డ్ కప్ గెలిచినా పట్టించుకోని ఫ్రాంఛైజీలు...
ఐపీఎల్‌లో యంగ్ స్టర్‌కి గిరాకీ ఎక్కువే. ముఖ్యంగా అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు తెగ పోటీపడిపోతాయి ఫ్రాంఛైజీలు. ఈసారి కూడా అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన భారత యంగ్ గన్స్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. అయితే సీజన్‌లో ఇప్పటిదాకా 50 మ్యాచులు ముగిసినా, కుర్రాళ్ల మెరుపులు పెద్దగా కనిపించలేదు...

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా అండర్ 19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. అర్ష్‌దీప్ సింగ్ 2018 అండర్ 19 వరల్డ్ కప్ ఆడితే రవి భిష్ణోయ్ 2020 వరల్డ్ కప్ ఆడాడు...
రవి భిష్ణోయ్‌తో పాటు యశస్వి జైస్వాల్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న భారత జట్టులో సభ్యులుగా ఐపీఎల్‌లోకి వచ్చిన వాళ్లే...
అయితే ఈసారి మాత్రం అండర్ 19 వరల్డ్ కప్ కుర్రాళ్లను ఆడించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఫ్రాంఛైజీలు.
అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే యష్ ధుల్ ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయాడు.
అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. 2 మ్యాచుల్లో రాజ్ ఆనంద్ బవాకి అవకాశం రాగా 11 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో మళ్లీ అతనికి అవకాశం ఇవ్వలేదు పంజాబ్ కింగ్స్..
అండర్ 19 వరల్డ్ కప్ ఆల్‌రౌండర్ రాజ్‌వర్థన్ హంగర్కేకర్‌ను రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే మనోడిని ఇప్పట్లో ఆడించలేమని సీఎస్‌కే హెడ్ కోచ్ కామెంట్ చేశాడు...
Dewald Brevis
మనోళ్లని పట్టించుకోకపోయినా అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన సౌతాఫ్రికా బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్‌ని ముంబై ఇండియన్స్ బాగానే వాడుకుని, మనోడికి కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చి, కరెక్టుగా వాడుకుంది...