- Home
- Sports
- Cricket
- ఉమేశ్ యాదవ్ కెరీర్ ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైంది... కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వ్యాఖ్యలు...
ఉమేశ్ యాదవ్ కెరీర్ ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైంది... కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వ్యాఖ్యలు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు కేకేఆర్ సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్. ఐపీఎల్ 2022 మెగా వేలంలో తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్‌ని, రెండో రౌండ్‌లో బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కేకేఆర్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో నో బాల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఉమేశ్ యాదవ్, అదే ఓవర్‌లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్‌ని డకౌట్ చేశాడు..
తొలి ఓవర్‌లో రుతురాజ్‌ను అవుట్ చేసిన ఉమేశ్ యాదవ్, మూడో ఓవర్ తొలి బంతికే డివాన్ కాన్వేని పెవిలియన్‌కి చేర్చాడు. 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు ఉమేశ్ యాదవ్...
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి అవుటయ్యాడు ఉమేశ్...
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 18 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్ తర్వాత అత్యధిక స్కోరు ఉమేశ్ యాదవ్‌దే. బౌలింగ్‌లోనే ఉమేశ్ యాదవ్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
అనుజ్ రావత్‌ని డకౌట్ చేసిన ఉమేశ్ యాదవ్, తన రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. 17 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ, ఆచితూచి ఆడడంతో ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ రిజల్ట్ వచ్చింది.
మొదటి మ్యాచ్ కంటే నాలుగు పరుగులు తక్కవగా ఇచ్చిన ఉమేశ్ యాదవ్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు..
2020 సీజన్‌లో రెండు మ్యాచులాడి వికెట్ తీయలేకపోయిన ఉమేశ్ యాదవ్, గత సీజన్‌లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారి పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు..
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందే ఈసారి అదరగొడతానని మాటిచ్చిన ఉమేశ్ యాదవ్, దాన్ని నిలుపుకుంటూ అద్భుతమైన స్పెల్స్‌తో దూసుకుపోతున్నాడు..
‘ఉమేశ్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఉమేశ్ యాదవ్‌తో కలిసి ఆడడం వల్ల అతని ఆట గురించి నాకు బాగా తెలుసు... ఉమేశ్ యాదవ్‌లో చాలా సత్తా ఉంది. ముఖ్యంగా కొత్త బాల్‌తో అతను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. పిచ్ నుంచి సహకారం రాకపోయినా వికెట్ తీయగల సామర్థ్యం ఉమేశ్ సొంతం...
అతను కొన్ని పరుగులు ఇచ్చినా మేం పట్టించుకోం. ఎందుకంటే ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్, మిగిలిన టీమ్స్ ప్లేయర్లను మెంటల్‌గా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మాకు బాగా తెలుసు...
మొదటి రెండు మ్యాచుల్లో ఉమేశ్ యాదవ్ మేం ఊహించిన దాని కంటే మెరుగ్గా రాణించాడు. ఇదే పర్ఫామెన్స్ కంటిన్యూ చేస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పుడతని వయసు 34 ఏళ్లు...
చాలామంది ఉమేశ్ యాదవ్ కెరీర్ ఎండింగ్‌కి చేరుకుందని అంటున్నారు. అయితే అతని ఫిట్‌నెస్, బౌలింగ్ చూస్తుంటే, ఉమేశ్ యాదవ్ కెరీర్ ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తోంది. మాకు అతనో ఆస్తి...’ అంటూ కామెంట్ చేశాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్...
మొదటి రెండు మ్యాచుల్లో ఓ విజయం, ఓ పరాజయం అందుకున్న కేకేఆర్, తన తర్వాతి మ్యాచ్‌లను ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది...