- Home
- Sports
- Cricket
- వేసే ఒక్కో బాల్‌కి రూ.4 లక్షలకు పైగా... ఐపీఎల్ 2022 సీజన్‌లో టాప్ 5 ఖరీదైన బౌలర్లు వీరే...
వేసే ఒక్కో బాల్‌కి రూ.4 లక్షలకు పైగా... ఐపీఎల్ 2022 సీజన్‌లో టాప్ 5 ఖరీదైన బౌలర్లు వీరే...
ఐపీఎల్... ప్రపంచంలో మోస్ట్ కాస్ట్‌లీ క్రికెట్ లీగ్. సత్తా ఉన్న ప్లేయర్ల కోసం కోట్లు కురిపించడానికి సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైజీలు. ఈసారి కూడా ఫాస్ల్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల కోసం పోటీపడ్డాయి ఫ్రాంఛైజీలు. ఐపీఎల్ మెగా వేలంలో కోట్లు దక్కించుకున్న ఐదుగురు బౌలర్లు... 2022 సీజన్‌లో వేసే ఒక్కో బంతికి రూ.3 లక్షలకు పైగా అందుకోబోతున్నారు...

ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు మాత్రమే వేయడానికి ఏ బౌలర్‌కైనా అనుమతి ఉంటుంది. అంటే మ్యాచ్‌కి 24 బంతులు. మొత్తంగా లీగ్‌లో 14 మ్యాచులు ఆడినా... గ్రూప్ స్టేజ్‌లో 336 బంతులు మాత్రమే.
ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తే మరో రెండు లేదా మూడు మ్యాచులు అదనంగా ఆడాల్సి వస్తుంది. మూడు మ్యాచులు ఆడితే, మరో 12 ఓవర్లు అదనంగా వేయాల్సి ఉంటుంది.
అంటే ఐపీఎల్ సీజన్ మొత్తంగా బౌలింగ్ చేసినా ఒక్కో బౌలర్ అత్యధికంగా వేసే బంతుల సంఖ్య 372... ప్లేఆఫ్స్ చేరే జట్లు నాలుగే కాబట్టి, ప్రతీ బౌలర్, ప్రతీ మ్యాచ్‌లో పూర్తి కోటా వేస్తే 336 బంతులు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది...
టాప్ 5 హర్షల్ పటేల్: ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్‌ను రూ.10.75 కోట్లు పెట్టి తిరిగి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... హర్షల్ పటేల్, ఐపీఎల్ 2022 సీజన్‌లో వేసే ప్రతీ బంతికి రూ.3.19 కోట్లు తీసుకోబోతున్నాడు..
టాప్ 4 శార్దూల్ ఠాకూర్: గత సీజన్‌లో సీఎస్‌కే తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ను, 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... శార్దూల్ ఠాకూర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో వేసే ప్రతీ బంతి విలువ రూ.3.19 లక్షలు...
టాప్ 3 జస్ప్రిత్ బుమ్రా: స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాని రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా వేసే ప్రతీ బంతి విలువ రూ.3.57 లక్షలు...
టాప్ 2 దీపక్ చాహార్: ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్ కంటే ఎక్కువ మొత్తం తీసుకోబోతున్న ప్లేయర్ దీపక్ చాహార్. దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్.
ఐపీఎల్ 2022లో దీపక్ చాహార్ వేసే ప్రతీ బంతి విలువ రూ.4.16 లక్షలకు పైనే. గాయం కారణంగా సగం మ్యాచులకు పైగా దీపక్ చాహార్ దూరం కాబోతున్న విషయం తెలిసిందే...
టాప్ 1 రషీద్ ఖాన్: ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లకు డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసింది. రషీద్ ఖాన్ వేసే ప్రతీ విలువ రూ.4.46 లక్షలకు పైగా ఉంది.