- Home
- Sports
- Cricket
- శ్రేయాస్ అయ్యర్ గొప్ప బ్యాటరే కానీ ఆ టెక్నిక్ అస్సలు తెలీదు... మహ్మద్ కైఫ్ కామెంట్స్...
శ్రేయాస్ అయ్యర్ గొప్ప బ్యాటరే కానీ ఆ టెక్నిక్ అస్సలు తెలీదు... మహ్మద్ కైఫ్ కామెంట్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాడు భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. కుర్రాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫైనల్ చేర్చిన అయ్యర్, సీనియర్లతో కలిసిన కేకేఆర్‌ను నడిపించడంలో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతున్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దూకుడుగా ఆడి, 150+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 27.0 యావరేజ్‌తో 13 మ్యాచుల్లో 351 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యర్. స్ట్రైయిక్ రేటు 130లోపే ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లోని ఓ లోపాన్ని బయటపెట్టాడు...
‘శ్రేయాస్ అయ్యర్ గొప్ప బ్యాట్స్‌మెన్, కాదనను కానీ అతని బ్యాటింగ్‌లోనూ ఓ వీక్‌నెస్ ఉంది. అతను లెగ్ స్పిన్నర్లను ఆడలేడు. లెగ్ స్పిన్నర్ల టర్న్‌ని ఆడడానికి తెగ ఇబ్బంది పడతాడు..
భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడతారు. కానీ శ్రేయాస్ అయ్యర్ లాంటి ఇండియన్ బ్యాటర్, లెగ్ స్పిన్ ఆడడానికి ఇబ్బందిపడుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది...
ఈ సీజన్‌లో ఇప్పటికే లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో చాలా సార్లు అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. రవి భిష్ణోయ్, రాహుల్ చాహార్, కుల్దీప్ యాదవ్... అంతెందుకు ప్రతీ లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ అయ్యర్‌ని ఇబ్బంది పెట్టారు...
వారి బౌలింగ్‌లో అటాకింగ్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతున్నాడు శ్రేయాస్ అయ్యర్. అతనిలో ఉన్న కొన్ని స్పెషల్ క్వాలిటీస్, అయ్యర్‌ని స్పెషల్ బ్యాటర్‌గా మార్చాయి...
Shreyas Iyer
ఈ టెక్నిక్‌ని కూడా సరిచేసుకుంటే అతను ఇంకా బాగా రాణిస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...