MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శిఖర్ ధావన్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, అయ్యర్... ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనబోయే స్టార్లు వీరే..

శిఖర్ ధావన్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, అయ్యర్... ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనబోయే స్టార్లు వీరే..

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం జరగనుంది. పాత ఫ్రాంఛైజీలన్నీ గరిష్టంగా నలుగురికి మించి ఉంచుకోకుండా ప్లేయర్లందరినీ వేలానికి విడుదల చేయనున్నారు. ఐపీఎల్ రిటెన్షన్‌లో భాగం కానీ ప్లేయర్లు మాత్రం మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడని స్టార్ ప్లేయర్లు వీరే...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 30 2021, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

సురేష్ రైనా: ‘మిస్టర్’ ఐపీఎల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ధోనీతో పాటు రైనాని కూడా రిటైన్ చేసుకుంటూ వచ్చింది సీఎస్‌కే. అయితే గత సీజన్‌లో పర్ఫామెన్స్ కారణంగా రైనాని రిటైన్ చేసుకోవడం లేదు సీఎస్‌కే...

211

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని మొట్టమొదటి సారి ఫైనల్‌ చేర్చిన యంగెస్ట్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అన్నీ సజావుగా జరిగి ఉంటే, అయ్యర్... ఢిల్లీకి ఫస్ట్ రిటెన్షన్‌గా ఉండేవాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ఫస్టాఫ్‌కి ముందు జరిగిన గాయం సీన్ మొత్తం మార్చేసింది. 

311

రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వడంతో బాగా హార్ట్ అయిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీకి మారాలని ఫిక్స్ అయ్యాడట...

411

శిఖర్ ధావన్: గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. గత సీజన్‌లో 600+ పరుగులు చేసిన ధావన్, ఐపీఎల్ 2021లో 587 పరుగులు చేశాడు...

511

రవిచంద్రన్ అశ్విన్: ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ ఆల్‌రౌండర్‌గా మారాడు. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన అశ్విన్, గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. అశ్విన్‌, ఢిల్లీ తనని రిటైన్ చేసుకోవడం లేదని స్వయంగా ప్రకటించాడు...

611

హార్ధిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగి, భారత జట్టులోకి వచ్చాడు హార్ధిక్ పాండ్యా. అయితే గత రెండు సీజన్లలో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, బ్యాటుతోనూ పెద్దగా రాణించలేకపోయాడు..

711

హర్షల్ పటేల్: ఐపీఎల్ 2021 సీజన్ హర్షల్ పటేల్ రాతను పూర్తిగా మార్చేసింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, ఆర్‌సీబీలో ఉన్న స్టార్ల కారణంగా రిటైన్ కాలేకపోతున్నాడు. అయితే వేలంలో హర్షల్ పటేల్‌కి భారీ ధర దక్కే అవకాశం ఉంది.

811

సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్. 2021 సీజన్‌కి వరుసగా మూడు సీజన్లలో 400+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.

911

దీపక్ చాహార్: చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్ దీపక్ చాహార్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒకటి రెండు వికెట్లు తీసే దీపక్ చాహార్‌ను రిటైన్ చేసుకోవడం లేదు చెన్నై సూపర్ కింగ్స్...

1011

మయాంక్ అగర్వాల్: పంజాబ్ కింగ్స్ జట్టులో కెఎల్ రాహుల్ తర్వాత అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లందరినీ వేలానికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది...

1111

మనీశ్ పాండే: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మనీశ్ పాండేని నమ్మినంతగా ఏ ప్లేయర్‌నీ నమ్మలేదేమో. గత మెగా వేలంలో మనీశ్ పాండేని రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్, మూడేళ్ల పాటు ఏటా రూ.11 కోట్లు చెల్లించింది. అయితే ఈసారి మనీశ్ అన్నను రిటైన్ చేసుకోవడం లేదు ఆరెంజ్ ఆర్మీ...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
SRH 2026 ఒకటి స్ట్రాంగ్.. ఒకటి వీక్.. మరి కావ్య పాప ప్లాన్ ఇదేనా.!
Recommended image2
SRH Vs RCB: ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్.. మరోవైపు కాటేరమ్మ కొడుకులు.. మ్యాచ్ మజానే వేరు
Recommended image3
IPL 2026 : వీరి అనుభవమే ఆయుధం.. ధోని, కోహ్లీ, రోహిత్ లే కాదు, అదరగొట్టేందుకు సిద్దమైన టాప్ 8 వెటరన్ ప్లేయర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved