- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022: రెండు గ్రూప్‌లుగా ఫ్రాంఛైజీలు... మార్చి 26 నుంచి మోగనున్న మెగా సమర శంఖం...
ఐపీఎల్ 2022: రెండు గ్రూప్‌లుగా ఫ్రాంఛైజీలు... మార్చి 26 నుంచి మోగనున్న మెగా సమర శంఖం...
ఐపీఎల్ 2022 సీజన్ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చేసింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022, మే 29న జరిగే మెగా ఫైనల్‌తో తెర పడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేశాయి...

కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి మహరాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లోనే ఐపీఎల్ మ్యాచులన్నీ జరగబోతుండడం విశేషం...
రెండు గ్రూప్‌లుగా ఐపీఎల్ 2022 సీజన్‌లో లీగ్ మ్యాచులు ఆడబోతున్నాయి జట్లు. గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు ఉన్నాయి...
గ్రూప్ బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి...
ఒకే గ్రూప్‌లో ఉన్న జట్లతో రెండేసి మ్యాచులు ఆడుతుంది ప్రతీ ఫ్రాంఛైజీ. అలాగే మరో గ్రూప్‌లో ఉన్న నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, మరో జట్టుతో రెండు మ్యాచులు ఆడుతుంది...
ఉదాహరణకి గ్రూప్ బీలో ఉన్న ఆర్‌సీబీ... చెన్నై, సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో రెండేసి మ్యాచులు ఆడుతుంది...
అలాగే గ్రూప్ ఏలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో రెండు మ్యాచులు ఆడే ఆర్‌సీబీ... ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది...
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రెండేసి మ్యాచులు జరగబోతుండగా కేకేఆర్- సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రెండేసి మ్యాచులు జరుగుతాయి.