- Home
- Sports
- Cricket
- మూడు ఫ్రాంఛైజీలు మారినా వదలకుండా వెంటాడుతూ... సర్ఫరాజ్ ఖాన్‌కి శత్రువులా మారిన ఆ ప్లేయర్...
మూడు ఫ్రాంఛైజీలు మారినా వదలకుండా వెంటాడుతూ... సర్ఫరాజ్ ఖాన్‌కి శత్రువులా మారిన ఆ ప్లేయర్...
పాకెట్ డైనమేట్ అని అందరూ రిషబ్ పంత్‌ని ఇప్పుడు అంటున్నారు కానీ, ఏడేళ్ల క్రితమే తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఈ ట్యాగ్‌లైన్‌కి కరెక్ట్ ప్లేయర్‌లా కనిపించాడు సర్ఫరాజ్ ఖాన్. దేశవాళీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో నమ్మశక్యంకాని రీతిలో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, ఐపీఎల్‌లో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోవడం లేదు...

2015 సీజన్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌ని రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ, ఆ తర్వాత 2018లో అతన్ని రూ.3 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది...
ఆ తర్వాత 2019 సీజన్ నుంచి గత సీజన్ వరకూ రూ.25 లక్షలకు పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే ఈ ప్లేయర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు.
2015లో 13 మ్యాచుల్లో 8 సార్లు బ్యాటింగ్ చేసి 111 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, 2016లో ఐదు మ్యాచులాడి 66 పరుగులు, 2018లో 7 మ్యాచులు ఆడి 51 పరుగులు చేశాడు...
సర్ఫరాజ్ ఖాన్ ఉన్నా తుదిజట్టులో అతని కంటే పంజాబ్ ప్లేయర్ మన్‌దీప్ సింగ్‌ని తుదిజట్టులో ఆడించడానికి బెంగళూరు యాజమాన్యం మొగ్గుచూపేది..
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తరుపున 2019లో 8 మ్యాచులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, 180 పరుగులు చేశాడు. 2020 సీజన్‌లో 5 మ్యాచుల్లో సర్ఫరాజ్‌ఖాన్‌కి అవకాశం దక్కగా, 2021లో అయితే రెండే రెండు మ్యాచుల్లో తుదిజట్టులో ప్లేస్ దక్కింది...
ఫారిన్ ప్లేయర్ల కారణంగా ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యే ప్లేయర్ల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ ఉండేవాళ్లు. పంజాబ్ కింగ్స్‌లో కూడా సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మన్‌దీప్ సింగ్ తుదిజట్టులో చోటు దక్కించుకునేవాడు...
తాజాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఇక్కడ కూడా మన్‌దీప్ సింగ్, మరోసారి తన బెర్త్‌కి ఎర్త్ పెట్టాడు...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌కి బదులు మన్‌దీప్ సింగ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు...
మూడు ఫ్రాంఛైజీలు మారినా మన్‌దీప్ సింగ్ రూపంలో సర్ఫరాజ్ ఖాన్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతూ... సరైన అవకాశాలు రాకుండా చేస్తోందని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...
ముంబై తరుపున రంజీ ట్రోఫీ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, గత 9 ఇన్నింగ్స్‌ల్లో కలిసి 199.16 యావరేజ్‌తో 1195 పరుగులు చేశాడు... గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఓ సెంచరీ (177 పరుగులు), రెండు డబుల్ సెంచరీలు (226 నాటౌట్, 275 నాటౌట్), ఓ త్రిబుల్ సెంచరీ (301 నాటౌట్), మూడు హాఫ్ సెంచరీలు (71*, 78, 71* ) నమోదు చేశాడు...
అయినా భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్, ఐపీఎల్‌లో మన్‌దీప్ సింగ్ రూపంలో బ్యాడ్ లక్ వెంటాడుతుండడంతో సరైన అవకాశాలు పొందలేకపోతున్నాడు..