MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • సారా టెండూల్కర్ బాయ్‌ఫ్రెండ్ శుబ్‌మన్ గిల్ కాదా... ఆ గోవా డిజైనర్‌తో కలిసి...

సారా టెండూల్కర్ బాయ్‌ఫ్రెండ్ శుబ్‌మన్ గిల్ కాదా... ఆ గోవా డిజైనర్‌తో కలిసి...

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ముట్టుకుంటే కందిపోయే పాలరాతి శిల్పంలా మెరిసిపోయే సారా టెండూల్కర్, త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ కూడా వినబడుతోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 22 2022, 08:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

లండన్‌లో మెడిసిన్ పూర్తి చేసి వచ్చిన తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన సారా టెండూల్కర్... క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. ఈ వార్తపై అటు సారా కానీ, ఇటు శుబ్‌మన్ గిల్ కానీ ఎనాడూ స్పందించలేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)

Image Credit: Shubman Gill Instagram (L); Sara Tendulkar Instagram (R)

కొన్నాళ్ల కిందట శుబ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు చూసి... ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. అంతేనా గిల్ ఏం పోస్టు చేసినా, సారా టెండూల్కర్ ఏ పోస్టు చేసినా... దాని కింద వచ్చే కామెంట్లలో సగానికి పైగా ఈ ఇద్దరి రిలేషన్ గురించే ఉంటాయి...

310

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచులకు ముంబై జెర్సీలో హాజరై, స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది సారా టెండూల్కర్. తమ్ముడు అర్జున్ టెండూల్కర్‌ని టీజ్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు చేసింది.. 

410

సారా ఏ పోస్టు చేసినా దాని కింద శుబ్‌మన్ గిల్ గురించి కామెంట్లు వేలల్లో వస్తాయి... అయితే సారా టెండూల్కర్ బాయ్‌ఫ్రెండ్ శుబ్‌మన్ గిల్ కాదంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సారా టెండూల్కర్ తన స్నేహితురాలి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు గోవాలో ఉంది...

510

ఈ పెళ్లిలో సారా టెండూల్కర్ దిగిన కొన్ని ఫోటోల్లో ప్రముఖ డిజైనర్, మోడల్, ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేర్కర్‌తో సన్నిహితంగా ఉండడం కనిపించింది. అదీకాకుండా సిద్ధార్థ్ పోస్టు చేసిన ఫోటోల్లో ముఖం కనిపించకుండా ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు అగుపించింది...

610

దీంతో సారా టెండూల్కర్, సిద్ధార్థ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నారు. సొంతంగా డిజైనింగ్ వస్త్రాల బిజినెస్ ప్రారంభించిన సిద్ధార్థ్... మంచి పెయింటర్ మాత్రమే కాదు, మోడల్ కూడా...

710

అదీకాకుండా కొన్నిరోజుల క్రితం ఓ యువకుడిని ముద్దాడుతూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేసి, కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది సారా టెండూల్కర్. ఆ ఫోటోలో ఉన్నది కూడా సిద్ధార్థ్‌యే అంటున్నారు నెటిజన్లు...

810

24 ఏళ్ల సారా టెండూల్కర్‌‌ ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్లతో సమానంగా మారిపోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఎఫైర్స్‌ అతికించినట్టే, సచిన్ కూతురిని కూడా టార్గెట్ చేస్తూ... డేటింగ్ వార్తలు అల్లేస్తున్నారు సోషల్ మీడియా జనాలు...

910
Sara Tendulkar

Sara Tendulkar

కొన్నిరోజుల కిందట 19 ఏళ్ల సౌతాఫ్రికా క్రికెటర్ డేవాల్ బ్రేవిస్, సారా టెండూల్కర్ అందానికి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడంటూ కొన్ని వీడియోలు యూట్యూబ్‌లో ప్రత్యేక్షమైన విషయం తెలిసిందే..

1010

అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది సారా టెండూల్కర్. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved