- Home
- Sports
- Cricket
- రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్‌కి టీమిండియానే కారణమా... సెలక్ట్ చేసి, ఛాన్సులు ఇవ్వకుండా...
రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్యూర్‌కి టీమిండియానే కారణమా... సెలక్ట్ చేసి, ఛాన్సులు ఇవ్వకుండా...
రుతురాజ్ గైక్వాడ్... ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే ఈ యంగ్ ప్లేయర్ గురించి బాగా హైప్ తీసుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందే కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తుదిజట్టులో చోటు కూడా కోల్పోయాడు...

వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చి హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. అది మొదలు రుతురాజ్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయినా నాలుగో మ్యాచ్ నుంచి ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్... ఓ సెంచరీతో 635 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.
అతి పిన్న వయసులో ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌కి ఆ తర్వాత టీమిండియా తరుపున అనుకున్నన్ని అవకాశాలు రాలేదు...
Ruturaj Gaikwad
ఐపీఎల్ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హాజారే ట్రోఫీలో రికార్డు స్థాయిలో వరుసగా ఐదు సెంచరీలతో 603 పరుగులు చేశాడు...
ఐపీఎల్ 2021 తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో వైట్ బాల్ సిరీస్‌లకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్... మొత్తంగా ఒకే మ్యాచ్ ఆడాడు...
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలో దిగడంలో ఈ యంగ్ ఓపెనర్‌కి పెద్దగా ఛాన్స్‌లు రాలేదు...
టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్... ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్ఫామెన్స్‌పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇదే అతని సహజ ఆటతీరును దెబ్బతీసింది...
ఇప్పుడు టీమిండియాలో ఉన్న పోటీలో రుతురాజ్ గైక్వాడ్ స్థిరమైన చోటు దక్కించుకోవడం చాలా కష్టం. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ వంటి సీనియర్లు వారి ప్లేసుల్లో ఫిక్స్ అయిపోయారు..
రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చు. అప్పటిదాకా ఓపికతో ఎదురుచూసి, నిలకడైన పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది...
లేదంటే దేవ్‌దత్ పడిక్కల్ వంటి ప్లేయర్ల రూపంలో ఫ్యూచర్‌లో కూడా రుతురాజ్ గైక్వాడ్... టీమిండియాలో ప్లేస్ కోసం విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...