MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రికీ పాంటింగ్ వల్లే శ్రేయాస్ అయ్యర్ బయటికి... ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి సపోర్ట్ చేసి...

రికీ పాంటింగ్ వల్లే శ్రేయాస్ అయ్యర్ బయటికి... ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి సపోర్ట్ చేసి...

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఆలస్యంగా ఫైనల్‌కి అర్హత సాధించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జయవర్థనే, పీటర్సన్ వంటి దిగ్గజాలు చేయలేని పనిని, ఎంతో ఈజీగా చేసి చూపించాడు శ్రేయాస్ అయ్యర్. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అయ్యర్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 12 2022, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Shreyas Iyer Rishabh Pant

Shreyas Iyer-Rishabh Pant

ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలిసారి ఫైనల్‌కి అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, తుదిపోరులో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే ఆ తర్వాతి సీజన్‌లోనే అయ్యర్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది...

210

2021 సీజన్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఫస్టాఫ్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ సమయానికి అయ్యర్ గాయం నుంచి కోలుకున్నా, కెప్టెన్సీ మాత్రం దక్కలేదు...

310

శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్, తన కెప్టెన్సీ స్కిల్స్‌తో మేనేజ్‌మెంట్‌ను మెప్పించాడు. దీంతో అయ్యర్ కోలుకున్నా, రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది ఢిల్లీ క్యాపిటల్స్...
 

410

కెప్టెన్సీ పోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడాలని నిర్ణయం తీసుకోవడం... మెగా వేలంలో కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసి, కెప్టెన్సీ అప్పగించడం జరిగిపోయాయి...

510

‘రిషబ్ పంత్ దూకుడైన ప్లేయర్. అందుకే అతను కెప్టెన్‌గా తీసుకునే నిర్ణయాలు కూడా అంతే దూకుడుగా ఉంటాయి. అతని కెరీర్ ఇప్పుడే మొదలైంది. అయితే ఇప్పుడే అతను సీనియర్ రోల్ పోషిస్తున్నాడు...

610

రిషబ్ పంత్ ఆడుతుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవు. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన బ్యాటర్లకు బ్రేక్ ఇచ్చి, రిషబ్ పంత్ టాపార్డర్‌లో వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు... అదే పంత్ స్ట్రాటెజీ...

710

రిషబ్ పంత్ సక్సెస్ వెనక, అతని కెప్టెన్సీ వెనకాల రికీ పాంటింగ్ ఉంటాడు. అయితే పంత్ ఆడే విధానంలో మాత్రం పాంటింగ్ ఉండడు. అతని ఆట, అతని స్టైల్ అతనిదే...

810

శ్రేయాస్ అయ్యర్ కంటే రిషబ్ పంత్‌ని రికీ పాంటింగ్ ఎక్కువ సపోర్ట్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత కూడా రిషబ్ పంత్ కెప్టెన్‌గా కొనసాగడానికి కారణం ఇదే...

910

శ్రేయాస్ అయ్యర్‌లోని కెప్టెన్సీ స్కిల్స్‌ని గుర్తించింది కూడా పాంటింగే. కానీ శ్రేయాస్ కంటే రిషబ్ పంత్‌ మెరుగైన కెప్టెన్ అవుతాడని రికీ పాంటింగ్ భావించాడు... 

1010

రిషబ్ పంత్‌కి జట్టుని ఎలా నడిపించాలో బాగా తెలుసు. దూకుడుగా పంత్ తీసుకునే నిర్ణయాలను సపోర్ట్ చేస్తూనే, అతను చేసే తప్పులను సరిదిద్దే పాంటింగ్ లాంటి కోచ్ కూడా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
SA vs NZ : టిమ్ సీఫెర్ట్ మాస్ బ్యాటింగ్.. ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ కుర్రాడు
Recommended image2
Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !
Recommended image3
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved