MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ రెండు ఫ్రాంఛైజీలకు ఆడాలని ఎవ్వరూ అనుకోరు... కెఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ వెళ్లిపోవడానికి కారణాలివే...

ఆ రెండు ఫ్రాంఛైజీలకు ఆడాలని ఎవ్వరూ అనుకోరు... కెఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ వెళ్లిపోవడానికి కారణాలివే...

ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కెఎల్ రాహుల్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఇద్దరూ బయటికి వెళ్లడానికి వేరే కారణాలున్నాయని అంటున్నాడు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 03 2021, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

పంజాబ్ కింగ్స్ జట్టు గత మూడు సీజన్లలోనూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఫ్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవగా, 2021 సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఏడో స్థానంలో నిలిచింది ఆర్ఆర్...

311

పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి కెఎల్ రాహుల్ బయటికి రావాలని నిర్ణయం తీసుకోవడంతో అతన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది టీమ్ మేనేజ్‌మెంట్...

411

అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు, టీమ్‌కి పూర్తి సమయం అందుబాటులో ఉండని కారణంగా బెన్ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌లని అట్టిపెట్టుకోవడం లేదని ప్రకటించింది...

511

‘పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని ఫ్రాంఛైజీలు. దాదాపు ఈ జట్లు ప్లేఆఫ్స్ కూడా అర్హత సాధించవు...

611

అలాంటి జట్ల తరుపున మళ్లీ ఆడడానికి ప్లేయర్లు పెద్దగా ఇష్టపడరు. అందుకే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, టైటిల్ గెలిచే సత్తా ఉన్న వేరే ఫ్రాంఛైజీలకు వెళ్లిపోతుంటారు...

711

రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న బెన్ స్టోక్స్ కూడా ఇలాగే కోరుకుని ఉండొచ్చు. ఓ కొత్త ఛాలెంజ్, ఓ కొత్త టీమ్‌తో సరికొత్తగా మొదలెట్టాలని అతను భావించి ఉండొచ్చు...

811

లేకపోతే అతని గాయం, వర్క్‌లోడ్ కారణంగా ఐపీఎల్‌ ఆడాలా? వద్దా? అనే విషయంపై బెన్ స్టోక్స్ ఇంకా నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు... 

911

జోఫ్రా ఆర్చర్ కూడా అంతే. పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండే ప్లేయర్లనే ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడతాయి... ఈ ఇద్దరి విషయంలో ఈ రెండే కారణాలు కావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరి...

1011

2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో చేరిన బెన్ స్టోక్స్, ఇప్పటిదాకా 604 పరుగులు, 16 వికెట్లు పడగొట్టాడు. అయితే గత సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గాయపడిన బెన్ స్టోక్స్, సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...

1111

జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కి, టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కూడా దూరమైన ఆర్చర్, ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనే విషయంలో క్లారిటీ రావడం లేదు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved