MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ మాత్రం దానికి ధోనీని అట్టిపెట్టుకోవడం కరెక్ట్ కాదు... సీఎస్‌కే రిటెన్షన్‌పై బ్రాడ్ హాగ్ కామెంట్స్...

ఆ మాత్రం దానికి ధోనీని అట్టిపెట్టుకోవడం కరెక్ట్ కాదు... సీఎస్‌కే రిటెన్షన్‌పై బ్రాడ్ హాగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2021 టైటిల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, వచ్చే సీజన్‌కి సంబంధించిన రిటెన్షన్‌ గురించి ఇప్పటికే కామెంట్ చేసింది. రిటెన్షన్ కార్డును ఎమ్మెస్ ధోనీ కోసం వాడతామని తెలిపాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Nov 28 2021, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఐపీఎల్ 2022 కోసం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు 2021 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకోనుంది చెన్నై సూపర్ కింగ్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

గత సీజన్‌లో 600+ పరుగులు చేసి, 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ కోల్పోయిన సీఎస్‌కే మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్‌ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోనుందని టాక్ వినిపించింది...

311

అయితే 37 ఏళ్ల ఫాఫ్ డుప్లిసిస్ మరో మూడేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడా? లేదా? అనేది అనుమానమే. అందుకే డుప్లిసిస్‌ని రిటైన్ చేసుకునే ఆలోచనను విరమించుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

411

సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా మహా అయితే వచ్చే సీజన్‌లో ఆడతాడని, ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి అతను రిటైర్మెంట్ తీసుకోవచ్చని టాక్ వినబడుతోంది...

511

‘ఎమ్మెస్ ధోనీ ఇంకెంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాడు. నాకు తెలిసి, అతను మహా అయితే వచ్చే సీజన్‌ ఆడొచ్చు. ఆ మాత్రం దానికి ఎమ్మెస్ ధోనీని రిటైన్ చేసుకోవడం అనవసరం...

611

నేనైతే ఎమ్మెస్ ధోనీని వేలానికి వదిలేసి, వేలంలో కొనుగోలు చేస్తా. ఇది చాలా కష్టమైన విషయమే కానీ ఐపీఎల్‌ లాంటి క్యాష్ లీగ్ ప్రపంచంలో ఇది చాలా పర్ఫెక్ట్ బిజినెస్ ఎత్తుగడ...

711

పర్సులో ఉన్న 15 శాతం డబ్బులను ఒకే ప్లేయర్‌పై, అదీ ఒకే ఆడాది ఆడే ప్లేయర్‌పై ఖర్చు పెట్టడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్...

811

బ్రాడ్ హాగ్, చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఫాఫ్ డుప్లిసిస్‌లను రిటైన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు...

911

‘ఆర్‌సీబీకి అనేక సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, యజ్వేంద్ర చాహాల్, దేవ్‌దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను రిటైన్ చేసుకోవచ్చు...

1011

నేనైతే మ్యాక్స్‌వెల్‌ను ఓవర్‌సీస్ ప్లేయర్‌గా కాకుండా, అతన్ని కెప్టెన్‌గా చేస్తా. ఎందుకంటే అలా చేస్తే, వేలానికి వెళ్లే ముందు కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు...

1111

ఆర్‌సీబీ సెలక్టర్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిలకడలేమిని చూసి భయపడొచ్చు. అతని పర్ఫామెన్స్ చూస్తే మాత్రం మ్యాక్సీకి కెప్టెన్సీ ఇవ్వడం కాస్త రిస్కే...’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Recommended image2
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved