ఐపీఎల్‌లో నన్ను అలా అవమానించారు... ఆర్‌సీబీ యాజమాన్యంపై విరాట్ కోహ్లీ కామెంట్స్...
ఐపీఎల్ కెరీర్‌లోనే ఆరంభం నుంచి ఇప్పటిదాకా 15 సీజన్ల పాటు ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ... ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా వంటి ప్లేయర్లు సీఎస్‌కేపై రెండేళ్లు బ్యాన్ పడడంతో ఈ రికార్డును సాధించలేకపోయారు...

ఐపీఎల్‌లో ఒక్క టైటిల్ గెలవలేకపోయినప్పటికీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేంజ్ వేరు...
2021 సంవతర్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెట్ ఫ్రాంఛైజీగా, మూడో క్రీడా ఫ్రాంఛైజీగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఆర్‌సీబీకి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి విరాట్ కోహ్లీయే ముఖ్య కారణం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయింది ఆర్‌సీబీ...
అయితే కెరీర్ ఆరంభంలో ఆర్‌సీబీ, తనను ఘోరంగా అవమానించిందని, ఆ విషయాలు ఇప్పటికీ తనకి బాగా గుర్తున్నాయని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
‘2008 సీజన్ తర్వాత నాకోసం ఎయిర్‌పోర్ట్‌కి ఓ ఓమ్నీ కారును పంపారు. నేను అప్పటికీ కేవలం అండర్-19 ప్లేయర్‌గా మాత్రమే ఉన్నా..
మిగిలిన వారికోసం ఏసీ కార్లు పంపారు. నాకు మాత్రం ఓ డొక్కు ఓమ్నీ పంపించారు. వాడికి ఏదో ఒకటి పంపి, ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకురావాలని వాళ్లు అనుకుని ఉండొచ్చు...
ఆ కారు కాస్త మంచిగా ఉన్నా, నేనేమీ ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు పంపిన కారు, అప్పటికే బాగా విరిగిపోయి, డొక్కుగా తయారైంది...
అందులో కూర్చుంటే రోడ్డుపైన వెళ్లేవన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అప్పటికే ఆ బండి షెడ్డుకి వెళ్లాల్సిన పొజిషన్‌లో ఉంది...’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు విరాట్ కోహ్లీ...
2008 సీజన్‌లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ 15 యావరేజ్‌తో కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ ఏడో స్థానంలో నిలిచింది...
కెరీర్ ఆరంభంలో మొదటి మూడు సీజన్లు కేవలం రూ.12 లక్షలు పారితోషికంగా తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత గత నాలుగు సీజన్లలో రూ.17 కోట్లు తీసుకుని అత్యధిక మొత్తం అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు...