త్వరలో రవీంద్ర జడేజాకే టీమిండియా కెప్టెన్సీ... మాహీ నిర్ణయం వెనక కారణం ఇదే...
టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 14 ఏళ్లకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అలాగే ఐపీఎల్‌లో 14 సీజన్ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ నయా సారథి రవీంద్ర జడేజా... ఐపీఎల్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడం వెనక చాలా పెద్ద రీజనే ఉందంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న మంది ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా మారిన జడ్డూ, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్నాడా?
‘నాకు ఎమ్మెస్ ధోనీ నిర్ణయం వెనకాల చాలా విషయాలు దాగి ఉన్నాయని అనిపిస్తోంది. భారత జట్టును మూడు ఫార్మాట్లలో నడిపించడం అంత తేలికయ్యే పని కాదు...
విరాట్ కోహ్లీ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించాడు. అయితే విరాట్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు...
అయితే రోహిత్ శర్మ ఈ వయసులో మూడు ఫార్మాట్లలో టీమ్‌ని నడిపించడం చాలా కష్టమైన విషయం. చాలా ఒత్తిడిని, భారాన్ని మోయాల్సి ఉంటుంది...
కాబట్టి త్వరలో భారత జట్టు కెప్టెన్సీని ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. లేదంటే రోహిత్ శర్మ, మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలను మోయలేడు.ఆ ప్లేస్‌లో కెప్టెన్సీ తీసుకోగల సత్తా ఉన్న ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకడు...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడంటే... రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా తయారుచేయాలనే ప్లాన్‌తోనే ఈ పని చేసి ఉండొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు డానిష్ కనేరియా...
34 ఏళ్ల వయసులో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకి ఇవ్వడంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మరో రెండు మూడేళ్ల తర్వాత రోహిత్ రిటైర్ అయితే, అప్పుడు మరో కెప్టెన్ కోసం చూస్తారా? అంటూ విమర్శించారు క్రికెట్ విశ్లేషకులు...
33 ఏళ్ల రవీంద్ర జడేజా కూడా రోహిత్ శర్మ లాగే గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ 2020 నుంచి ఇప్పటికే 15 నెలల కాలంలో మూడుసార్లు గాయపడి, జట్టుకి దూరమయ్యాడు...
రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకి కెప్టెన్సీ ఇవ్వడం కంటే రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లాంటి యువకులకు టీమిండియా సారథ్య బాధ్యతలు ఇవ్వాలని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...