- Home
- Sports
- Cricket
- డెత్ ఓవర్ స్పెషలిస్టుగా దూసుకొస్తున్న అర్ష్‌దీప్ సింగ్... భువీ ప్లేస్‌కి చెక్ పెట్టేస్తాడా? ...
డెత్ ఓవర్ స్పెషలిస్టుగా దూసుకొస్తున్న అర్ష్‌దీప్ సింగ్... భువీ ప్లేస్‌కి చెక్ పెట్టేస్తాడా? ...
ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అట్టిపెట్టుకున్నది ఇద్దరే ఇద్దరినీ. మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా రిటైన్ చేసుకున్న ప్రీతి జింటా టీమ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ని రిటైన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఆశించినట్టే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు అర్ష్‌దీప్ సింగ్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన అర్ష్‌దీప్ సింగ్, 18 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు...
2022 సీజన్‌లోనూ అదే పర్ఫామెన్స్‌ని కొనసాగుతున్నాడీ యంగ్ పేసర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ బౌలింగ్, ఎంతో అనుభవం ఉన్న బౌలర్లను తలదన్నేలా ఉంటోంది..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయానికి 4 ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్‌కి బంతిని అందించాడు కెప్టెన్ మయాంక్ అగర్వాల్. 17వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్, మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే 19వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి... జడేజా, ఎమ్మెస్ ధోనీలను సైలెంట్‌గా పెట్టగలిగాడు...
Arshdeep Singh
ఇంతకుముందు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచుల్లోనూ డెత్ ఓవర్లలో అదిరిపోయే బౌలింగ్ కనబర్చాడు అర్ష్‌దీప్ సింగ్...
ఇప్పటిదాకా డెత్ ఓవర్లలో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వని ఏకైక బౌలర్‌గా ఉన్నాడు అర్ష్‌దీప్ సింగ్. సీనియర్లు సునీల్ నరైన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా ఒక్కో సిక్సర్ సమర్పించగా, ఈ యంగ్ పేసర్ మాత్రం ఒక్క సిక్స్ కూడా ఇవ్వలేదు...
‘సీజన్ ముగిసే సమయానికి అర్ష్‌దీప్ సింగ్, బెస్ట్ డెత్ ఓవర్ బౌలర్ అవుతాడు. అతని బౌలింగ్‌ని నేను దగ్గర్నుంచి చూస్తూ, గమనిస్తున్నా. అతని టీమిండియాకి చాలా పెద్ద విలువైన ఆటగాడిగా మారతాడు...’ అంటూ కామెంట్ చేశాడు పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా...
జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ... ఈ ముగ్గురూ వైట్ బాల్ క్రికెట్‌లో భారత జట్టుకి డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్లుగా ఉన్నారు. అయితే భువీ కొంత కాలంగా నిలకడైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చినా అదే నిలకడైన పర్ఫామెన్స్ ఆఖరి వరకూ కొనసాగిస్తాడా? అనేది అనుమానమే.
దీంతో అర్ష్‌దీప్ సింగ్‌కి టీమిండియాలో అవకాశం ఇచ్చి, టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి డెత్ ఓవర్ బౌలర్‌గా సిద్ధం చేయాలని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ కూడా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని దాటి అర్ష్‌దీప్ సింగ్, టీమ్‌లోకి రావాలంటే పరుగులు నియంత్రించడంతో వికెట్లు తీయాల్సిన అవసరం ఉందంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...