MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ఒక్క పనితో కెఎల్ రాహుల్‌ని దాటేసిన మయాంక్ అగర్వాల్... పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌పై...

ఆ ఒక్క పనితో కెఎల్ రాహుల్‌ని దాటేసిన మయాంక్ అగర్వాల్... పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌పై...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కెరీర్ ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ ఒకడు. మయాంక్ అగర్వాల్‌ని, అన్‌క్యాప్డ్ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్‌ని మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్, పాత జట్టును మొత్తానికి 2022 మెగా వేలానికి విడుదల చేసిన విషయం తెలిసిందే...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 14 2022, 04:25 PM IST| Updated : May 14 2022, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Mayank Agarwal

Mayank Agarwal

మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో (గాయం కారణంగా ఓ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు) ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచులు ఆడిన పంజాబ్ కింగ్స్, 6 విజయాలు అందుకుని, 6 పరాజయాలు చవిచూసింది...

28

మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్‌కి ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అదే జరిగితే 2014లో ఫైనల్ చేరిన తర్వాత 8 సీజన్లకు తొలిసారి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినట్టు అవుతుంది పంజాబ్...

38

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2020 సీజన్‌లో 424 పరుగులు, 2021 సీజన్‌లో 441 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, ఈ సీజన్‌లో కెప్టెన్సీ ప్రెషర్ కారణంగా సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు. 11 మ్యాచుల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు మయాంక్...

48

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ పొజిషన్‌ని జానీ బెయిర్‌స్టోకి త్యాగం చేసిన మయాంక్ అగర్వాల్... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన జానీ బెయిర్ స్టో, మొదటి ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడి 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు...
 

58

టూ డౌన్‌లో వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ 200+ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

68

ఆరెంజ్ క్యాప్ కోసం, తాను పరుగులు చేయడం కోసం జట్టు ఏమైపోయినా పట్టించుకోని కెఎల్ రాహుల్ కంటే మయాంక్ అగర్వాల్ చాలా బెస్ట్ కెప్టెన్ అంటున్నారు నెటిజన్లు...

78
Mayank Agarwal

Mayank Agarwal

‘ఓ నిజమైన లీడర్‌ని చూడాలంటే మయాంక్ అగర్వాల్‌ని చూడండి. అతని ఓపెనింగ్ పొజిషన్‌ని జానీ బెయిర్‌స్టోకి త్యాగం చేసి, స్వేచ్ఛగా ఆడనిచ్చాడు మయాంక్. ఎంత మంది కెప్టెన్లు ఇలా చేస్తారు. చాలా బాగా ఆడావ్ జానీ... అతన్ని ఓపెనర్‌గా పంపిన మయాంక్ అగర్వాల్‌కి కూడా వెల్ డన్ చెప్పాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్..

88

‘మయాంక్ అగర్వాల్‌లో ఓ స్పెషల్ క్వాలిటీ ఉంది.. అదే అతని వినయవిధేతలు. జట్టుకి అవసరమైతే ఏం చేయడానికైనా మయాంక్ సిద్ధంగా ఉంటాడు. టాప్ ప్లేయర్.. సీజన్ ఎలా ముగిసినా అతనికి, పంజాబ్ కింగ్స్‌కి అభినందనలు తెలుపుతున్నా..’ అంటూ ట్వీట్ చేశారు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
Recommended image2
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
Recommended image3
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆసీస్ డామినేషన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved