ఎలా ఆడుతున్నారో కాదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా ముఖ్యమే... జహీర్ ఖాన్ కామెంట్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది ముంబై ఇండియన్స్. ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్, వరుసగా 8 మ్యాచుల్లో ఓడి చెత్త రికార్డు మూటకట్టుకోవడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబై ఇండియన్స్ పరాజయానికి ప్రధాన కారణంగా మెగా వేలంలో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన విధానమేనని ఆరోపణలు వచ్చాయి...

ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న జహీర్ ఖాన్, ఆటగాళ్ల ఎంపికలో తీసుకునే జాగ్రత్తల గురించి, పరిగణనలోకి తీసుకునే విషయాల గురించి, వ్యూహాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
‘చర్చల ద్వారానే మనుషుల గురించి ఎక్కువగా తెలుస్తుంది. అయితే చర్చల వల్ల అనుభవం గురించి మాత్రం తెలీదు. ఇప్పుడు ప్రతీ వేగంగా మారిపోతోంది. మనం ఆలోచించుకునేందుకు కావాల్సిన సమయం కూడా ఉండడం లేదు...
ప్రతీ ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన స్టోరీ ఉంటుంది. కాబట్టి ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో కాదు, వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కష్టపడి వచ్చిన వ్యక్తులు, సక్సెస్ కోసం నిత్యం పరితపించేందుకు సిద్ధంగా ఉంటారు...
వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారనేది ఆటలో వారికి ఉండే అంకితభావాన్ని తెలియచేస్తుంది. సాధారణంగా ఆటగాళ్ల ఆట గురించి చర్చించేటప్పుడు టెక్నికల్ సైడ్ గురించి మాత్రమే మాట్లాడతారు, అయితే టెక్నికల్ కంటే మానసిక అంశాలు కీలక పాత్ర పోషిస్తారు...
ఒక్కసారి మనం ఒకరికి పరిచయం అయ్యాక, అతను మనతో సౌకర్యవంతంగా ఫీల్ అవ్వాలి, ఎలాంటి సాయం కావాలన్నా వచ్చి అడిగేలా ఉండాలలి. అందుకే ఏ సాయం చేయడానికైనా నేను సిద్దంగా ఉంటానని వాళ్లకి చెబుతాను...’ అంటూ కామెంట్ చేశాడు జహీర్ ఖాన్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా 8 మ్యాచులు ఓడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్. అయితే మిగిలిన ఐదు మ్యాచుల్లో గెలిచినా ముంబై ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉండదు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పర్ఫామెన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా తిలక్ వర్మ, కుమార్ కార్తీకేయ, డేవాల్డ్ బ్రేవిస్ వంటి యంగ్ బౌలర్లు ఆకట్టుకునే పర్ఫామెన్స్‌తో మెప్పించారు...