- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసినా, ఆ లిస్టులో కనిపించని విరాట్ కోహ్లీ... ధావన్, రైనా, రోహిత్, ధోనీలతో...
ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసినా, ఆ లిస్టులో కనిపించని విరాట్ కోహ్లీ... ధావన్, రైనా, రోహిత్, ధోనీలతో...
ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటర్‌గా, ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు ఆర్‌సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఒకే బ్యాటింగ్ పొజిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేపోయాడు...

కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత కొన్నాళ్లు ఓపెనర్‌గా, మరికొన్నాళ్లు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా, టూ డౌన్ బ్యాటర్‌గా బ్యాటింగ్‌కి వచ్చాడు... దీంతో ఏ పొజిషన్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు...
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా టాప్‌లో ఉన్నాడు శిఖర్ ధావన్. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అదరగొట్టిన ధావన్, ఇప్పటిదాకా ఓపెనింగ్ పొజిషన్‌లో 5377 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు ధావన్...
వన్‌డౌన్‌లో 4934 పరుగులు చేశాడు ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా. బ్యాటర్‌గా, చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించడంలో కీ రోల్ పోషించిన సురేష్ రైనా... ఐపీఎల్‌లో వన్‌డౌన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు...
నాలుగో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ ప్లేయర్‌గా ఉన్నాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. టూ డౌన్ పొజిషన్‌లో ‘హిట్ మ్యాన్’ 2392 పరుగులు చేశాడు...
ఐదో స్థానంలో అత్యధిక పరుగులు చేసింది సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ తన కెరీర్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 1923 పరుగులు చేశాడు...
ఐపీఎల్‌లో ఆరో స్థానంలో అత్యధిక పరుగులు చేసింది ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్. పోలార్డ్ తన కెరీర్‌లో ఆరో పొజిషన్‌లో 1281 పరుగులు సాధించాడు...
ఏడులో రస్సెల్ తిష్ట వేసుకుని కూర్చొన్నాడు. ఏడో స్థానంలో విండీస్ ప్లేయర్, కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ 572 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ బ్యాటర్‌గా ఉన్నాడు...
ఎనిమిదిలో భజ్జీ... బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానంలో 406 పరుగులు చేసిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆ పొజిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ బ్యాటర్‌గా ఉన్నాడు...
9వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్, 9వ పొజిషన్‌లో 148 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ బ్యాటర్‌గా ఉన్నాడు...
భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, బ్యాటింగ్ ఆర్డర్‌లో పదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రవీణ్ తన ఐపీఎల్ కెరీర్‌లో 10వ స్థానంలో 86 పరుగులు సాధించాడు.
ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్. మునాఫ్, 11వ పొజిషన్ బ్యాటర్‌గా 30 పరుగులు చేశాడు...