- Home
- Sports
- Cricket
- ఆ ఒక్క కారణంగా అశ్విన్ ఆగకుండా 3 గంటల పాటు బౌలింగ్ చేశాడు... మహ్మద్ కైఫ్ కామెంట్...
ఆ ఒక్క కారణంగా అశ్విన్ ఆగకుండా 3 గంటల పాటు బౌలింగ్ చేశాడు... మహ్మద్ కైఫ్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్‌గా నిలిచింది. 218 పరుగులు భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్, 210 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. యజ్వేంద్ర చాహాల్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...

4 ఓవర్లలో 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్... 17వ ఓవర్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పితే.. అంతకుముందు 14వ ఓవర్‌లోనే డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్‌ను డకౌట్ చేశాడు అశ్విన్...
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆండ్రే రస్సెల్ క్లీన్‌బౌల్డ్ అయి, గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ రాయల్స్ సగం ఊపిరి పీల్చుకుంది...
‘అందరూ యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌ని మెచ్చుకుంటున్నా... రవిచంద్రన్ అశ్విన్ తీసిన ఆండ్రే రస్సెల్ వికెట్ మా విజయానికి చాలా కీలకం. రస్సెల్‌ని అవుట్ చేసిన బాల్... జస్ట్ అన్‌బిలివబుల్...’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్...
2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన రవిచంద్రన్ అవ్విన్‌తో తన సంభాషణని బయటపెట్టాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...
‘రాజస్థాన్ రాయల్స్‌కి మారడానికి ముందు అశ్విన్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నాతో పాటు ఉన్నాడు. ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో అశ్విన్ చాలా పరుగులు ఇచ్చాడు...
‘నేను ఎందుకు వచ్చావ్? ఈరోజు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్సే కదా...’ అని అడిగాను. దానికి అశ్విన్... ‘నిన్నటి మ్యాచ్‌లో నా లెంగ్త్ సరిగ్గా లేదు... అందుకే ప్రాక్టీస్ చేయడానికి వచ్చా...’ అని చెప్పాడు.
మ్యాచ్‌కి ముందు రోజు కొన్ని ప్రకటనల్లో పాల్గొనడం వల్ల పెద్దగా ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పాడు అశ్విన్. అందుకే ఆ సమయాన్ని ఇక్కడ వెచ్చించాలని డిసైడ్ అయ్యాడు...
ఆ రోజు దాదాపు 3 గంటల పాటు ఆపకుండా బౌలింగ్ చేశాడు అశ్విన్. తన లెంగ్త్ సరిగా ఉందని నమ్మకం కలిగేదాకా ఆగకుండా బౌలింగ్ చేస్తూనే ఉన్నాను...
ఆ తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్ బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతను ఎప్పుడూ కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. అదే అశ్విన్ సక్సెస్ సీక్రెట్...’ అని చెప్పుకొచ్చాడు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఫీల్డింగ్ కోచ్ మహ్మద్ కైఫ్...