- Home
- Sports
- Cricket
- రిటైన్ చేసుకుంటే రూ.6 కోట్లు ఇస్తామన్నారు, ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లకు కొన్నారు... ఆర్‌సీబీ ప్లానింగ్‌కి...
రిటైన్ చేసుకుంటే రూ.6 కోట్లు ఇస్తామన్నారు, ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లకు కొన్నారు... ఆర్‌సీబీ ప్లానింగ్‌కి...
ఐపీఎల్ వేలంలో ఒక్కో జట్టు, ఒక్కో రకమైన స్ట్రాటెజీతో వస్తుంది. సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్, శార్దూల్ ఠాకూర్ లాంటి ప్లేయర్‌ను అనుకున్న బడ్జెట్ దాటేసరికి వదులుకుంది. అయితే ఎలాంటి ప్లాన్ లేకుండా, కొందరు ప్లేయర్లను మైండ్‌లో ఫిక్స్ అయి, వారి కోసం ఎంతకైనా చెల్లించడానికి సిద్దమయ్యే జట్టు ఆర్‌సీబీ...

కొత్త కెప్టెన్ కోసం వెతుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శ్రేయాస్ అయ్యర్ కోసం రూ.20 కోట్లు పక్కనబెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అయ్యర్ కోసం బెంగళూరు అంతగా ప్రయత్నించలేదు..
ఆరంభంలో శ్రేయాస్ అయ్యర్ కోసం బిడ్ వేసిన ఆర్‌సీబీ, రూ.5+ కోట్లు దాటిన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. దాంతో అయ్యర్ కోసం ఆర్‌సీబీ ఎంతకైనా వెళ్తుందనే వార్త నిజం కాదని తేలిపోయింది...
యజ్వేంద్ర చాహాల్ వంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్‌ను వేలానికి వదిలి వేసిన ఆర్‌సీబీ, అతన్ని తిరిగి టీమ్‌లోకి తెచ్చేందుకు అంతగా ప్రయత్నించలేదు...
యజ్వేంద్ర చాహాల్‌ను రూ.6.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కోసం ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లించింది...
జోష్ హజల్‌వుడ్ కోసం రూ.7.75 కోట్లు, ఫాఫ్ డుప్లిసిస్ కోసం రూ.7 కోట్లు, దినేశ్ కార్తీక్ కోసం రూ.5.5 కోట్లు, అనుజ్ రావత్ కోసం రూ.3.4 కోట్లు, షాబాజ్ అహ్మద్ కోసం రూ.2.4 కోట్లు ఖర్చు చేసింది ఆర్‌సీబీ...
ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్‌ను వేలానికి వదిలివేసిన ఆర్‌సీబీ, అతన్ని తిరిగి జట్టులోకి తెచ్చేందుకు రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది...
‘నన్ను వేలానికి విడుదల చేసే ముందు ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్, నాతో మాట్లాడింది. నిన్ను రిటైన్ చేసుకుంటే నీకు రూ.6 కోట్లు ఇవ్వాలి. అయితే నువ్వు నాలుగో రిటెన్షన్ అవుతావు...
కాబట్టి మిగిలినవాళ్లకు చెల్లించే మొత్తం పెరిగి రూ.9 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి నిన్ను వేలంలో రూ.6 కోట్ల వరకూ చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.. ఈ ధర వస్తుందని మాత్రం ఊహించలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షల్ పటేల్...
రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంటే, రూ.9 కోట్లు ఖర్చు అవుతుందని మెగా వేలానికి వదిలేసిన ఆర్‌సీబీ, అతన్ని ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లించి తిరిగి జట్టులోకి తీసుకోవడంలో ఏ లాజిక్ ఉందో అర్థం కావడం లేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ పూర్తి జట్టు ఇదే: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, జోష్ హజల్‌వుడ్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లే, షెఫర్డ్ రూథర్‌ఫర్డ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ ఆలెన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సిద్ధార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, సూయాష్ ప్రభుదేశాయ్, చమా మిలింద్, అనీశ్వర్ గౌతమ్, ఆకాశ్ దీప్, లూనీత్ సిసోడియా