MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2022 మెగా వేలంలో వీళ్లని కొనేదెవ్వరు... రహానే, స్టీవ్ స్మిత్‌, కేదార్ జాదవ్‌లతో పాటు...

IPL2022 మెగా వేలంలో వీళ్లని కొనేదెవ్వరు... రహానే, స్టీవ్ స్మిత్‌, కేదార్ జాదవ్‌లతో పాటు...

ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్‌కి ఎంత ధర దక్కుతుందో అంచనా వేయడం కష్టమే. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్‌ డేవిడ్ మలాన్ కేవలం రూ.కోటి దక్కించుకుంటే, ఏ మాత్రం అనుభవం లేని కృష్ణప్ప గౌతమ్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది సీఎస్‌కే... అయితే ఈసారి మెగా వేలంలో కొందరు సీనియర్ ప్లేయర్లు అమ్ముడుపోవడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 04 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

అజింకా రహానే: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడిన అజింకా రహానే, రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గానూ చేశాడు. ఐపీఎల్ దాదాపు 4 వేల పరుగులు చేసిన రహానేకి గత రెండు సీజన్లుగా సరిగా అవకాశాలు కూడా దక్కడం లేదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు ఆడడమే కాకుండా కెప్టెన్సీ కూడా చేశాడు. అయితే ఐపీఎల్‌లో దాదాపు 2500 పరుగులు చేసిన స్మిత్, మూడు సీజన్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.

311

ఆరోన్ ఫించ్: ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 8 జట్లకి ఆడి అత్యధిక జట్లకు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఆరోన్ ఫించ్, గత ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. 

411

ఇయాన్ మోర్గాన్: కెప్టెన్‌గా కేకేఆర్‌ని ఫైనల్ చేర్చిన ఇయాన్ మోర్గాన్, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 17 మ్యాచుల్లో 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మోర్గాన్‌ని ఈసారి ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొంటుందనేది ఆసక్తికర అంశమే..

511

దినేశ్ కార్తీక్: కేకేఆర్ వికెట్ కీపర్‌గా, ఫినిషర్‌గా, మాజీ కెప్టెన్‌గా ఉన్న దినేశ్ కార్తీక్‌కి ఐపీఎల్‌కి 4 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. అయితే 36 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపిస్తుందనేది కూడా అనుమానంగానే మారింది...

611

ఛతేశ్వర్ పూజారా: టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని, గత సీజన్‌లో సీఎస్‌కే బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్ ఆడించలేదు. ఈసారి అతన్ని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవచ్చు. 

711

హనుమ విహారి: తెలుగు క్రికెటర్ హనుమ విహారి, గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ అమ్ముడుపోలేదు. ఈసారి కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించకపోవచ్చు.

811

ఇషాంత్ శర్మ: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, గత ఐపీఎల్‌లో గాయం కారణంగా తప్పుకున్నాడు. మూడు మ్యాచులు ఆడినా ఒకే వికెట్ తీయగలిగాడు. ఇషాంత్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపించకపోవచ్చని అంచనా...

911

అమిత్ మిశ్రా: సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, గత ఐపీఎల్‌లో 4 మ్యాచులు ఆడి 6 వికెట్లు తీయగలిగాడు. అయితే గాయాలతో సతమతమవుతున్న మిశ్రా బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. అతని కోసం ఆ మొత్తం చెల్లించేందుకు ఏ జట్టు ఆసక్తి చూపిస్తుందనేది అనుమానమే.

1011

విజయ్ శంకర్: లక్కీగా 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్లలో ఒకడు. గత 2021 సీజన్‌లో 7 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్, 58 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు...

1111

కేదార్ జాదవ్: భారత సీనియర్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 12 సీజన్లు ఆడాడు. గత రెండు సీజన్లలో కలిపి 117 పరుగులు చేసిన జాదవ్‌ని ఈసారి ఏ జట్టైనా కొనుగోలు చేసిందంటే అది ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved