- Home
- Sports
- Cricket
- మేం ఓడిపోవాలని చాలామంది కోరుకున్నారు, గెలుస్తుంటే ఓర్వలేక... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు...
మేం ఓడిపోవాలని చాలామంది కోరుకున్నారు, గెలుస్తుంటే ఓర్వలేక... మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు...
టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్‌లలో రవిశాస్త్రి ఒకడు. కోచ్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా విదేశాల్లో అసాధ్యమైన విజయాలు సాధించాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీతో పాటు అజింకా రహానే, రోహిత్ శర్మ కెప్టెన్సీలో రవిశాస్త్రి కోచింగ్‌లో టీమ్ అద్భుత విజయాలు అందుకుంది...

ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ టెస్టులో ఘోర పరాభవం తర్వాత ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు 1-2 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుని... అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి... తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...
‘నా దగ్గర కోచింగ్ బ్యాడ్జీలు లేవు... లెవెన్ వన్? లెవన్ 2? అలా ఏ బ్యాడ్జీలు లేవు. ఇండియా లాంటి దేశంలో ఒకడు వస్తుంటే, కొన్ని వందల మంది దాన్ని చూసి తట్టుకోలేరు... మనం ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు...
నా విషయంలోనూ అదే జరిగింది. నేను హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేం ఓడిపోవాలని చాలామంది కోరుకున్నారు. అయితే నా చర్మం చాలా దృఢమైనది...
డ్యూక్ బాల్స్‌కి వాడే తోలు కంటే బలంగా ఉంటుంది. అంత తేలిగ్గా నేను ఎవ్వరికీ లొంగను. ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడను. ఇక్కడ మనం ఏం చేసినా, దాన్ని విమర్శించడానికి, తప్పులు వెతకడానికి చాలామంది ఖాళీగా ఉంటారు...
దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే పని కంటే మాటలు పడుతూ, చాలామందికి ఏం చేస్తున్నామో సమాధానం చెప్పాల్సి ఉంటుంది...
అయితే ప్లేయర్లను అర్థం చేసుకుని, వారిని ముందుగా మనం నమ్మి, వారిపై వారికి నమ్మకం కలిగిస్తే చాలు... విజయాలు వాటంతట అవే వస్తాయి... టీమ్ కల్చర్ పాడుకాకుండా చూసుకుంటే సరిపోతుంది...
ఆస్ట్రేలియాలో కమ్మిన్స్, స్టార్క్, హజల్‌వుడ్ వంటి పేస్ అటాకింగ్‌ని తట్టుకుని, అది కూడా 1-0 తేడాతో వెనకబడిన తర్వాత సిరీస్ గెలుస్తామని ఎవ్వరైనా ఊహించి ఉంటారా... కానీ మేం చేసి చూపించాం...
ఇంగ్లాండ్‌లోనూ అంతే. ఇలాంటి విజయాలు ఏ జట్టుకైనా అంత తేలిగ్గా దొరకవు. ఇండియా సాధించిన విజయాలను రిపీట్ చేయడానికి చాలా టైం పడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...