- Home
- Sports
- Cricket
- కుల్దీప్ యాదవ్ సక్సెస్‌కి రోహిత్ శర్మయే కారణం, విరాట్ కోహ్లీ మాత్రం... చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్...
కుల్దీప్ యాదవ్ సక్సెస్‌కి రోహిత్ శర్మయే కారణం, విరాట్ కోహ్లీ మాత్రం... చిన్ననాటి కోచ్ షాకింగ్ కామెంట్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న సీనియర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో ఉన్న గత మూడు సీజన్లలో కలిపి 5 వికెట్లు మాత్రమే తీయగలిగిన కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో ఏకంగా పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు...

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో బేస్ ప్రైజ్‌కి అమ్ముడుపోయిన కుల్దీప్ యాదవ్, 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి... పర్పుల్ క్యాప్ రేసులో యజ్వేంద్ర చాహాల్ తర్వాతి స్థానంలో నిలిచాడు...
రెండు మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిన అన్ని మ్యాచుల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు. కుల్దీప్ యాదవ్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నీ సరిగా జరిగితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా ఆడే అవకాశం ఉంది...
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు టీమిండియాలో కూడా కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత వరుసగా జట్టుకి ఎంపిక అవుతున్నా రిజర్వు బెంచ్‌లో ఉంటూ, వాటర్ బాటిల్స్ మోయడానికే ఉపయోగపడ్డాడు...
కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ దేవ్ పాండే, చైనామెన్ బౌలర్ సక్సెస్‌కి రోహిత్ శర్మయే కారణమని అంటున్నాడు. ‘కుల్దీప్ యాదవ్ గత మూడు సీజన్లలో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు...
ఐపీఎల్‌లో మాత్రమే కాదు టీమిండియా తరుపున టెస్టులు, వన్డేలు, టీ20ల్లోనూ కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. కేకేఆర్ అయితే కుల్దీప్ యాదవ్‌ని అస్సలు నమ్మలేదు...
కుల్దీప్ యాదవ్, కేకేఆర్‌లో చాలా కృంగిపోయాడు. రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోందని నిరాశకు గురయ్యాడు. నేను అతనికి నమ్మకం కోల్పోవద్దని, ప్రాక్టీస్ చేస్తూనే ఉండమని సలహా ఇచ్చాను...
కష్టపడుతూ ఉంటే సక్సెస్ అదే వస్తుంది. కేకేఆర్, అతన్ని వదిలేసినందుకు చాలా సంతోషించా. వేలంలో కుల్దీప్‌కి రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడే కుల్దీప్‌కి చెప్పాను, నీకు ఎంత ధర వచ్చిందని చూడకు, మంచి టీమ్‌లో చోటు దక్కింది, దాన్ని సరిగ్గా వాడుకొమ్మని చెప్పా...
కుల్దీప్, ఐపీఎల్‌లో ఆడడమే మాత్రమే టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లలో రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. కేకేఆర్ రిటైన్ చేసుకుని, అతనికి అవకాశాలు ఇవ్వకుండా అవమానించింది...
అందుకే టీమ్ మారిన తర్వాతైనా కుల్దీప్ యాదవ్ రాత మారుతుందని భావించా. నేను అనుకున్నట్టే ఢిల్లీ క్యాపిటల్స్‌లో అతను సూపర్ సక్సెస్ అవుతున్నాడు...
ఇంతకుముందు కుల్దీప్ యాదవ్‌కి ఎమ్మెస్ ధోనీ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌లో హెడ్ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ రిషబ్ పంత్... కుల్దీప్‌కి అండగా నిలుస్తున్నారు... అయితే అన్నింటికంటే ఎక్కువగా కుల్దీప్ సక్సెస్‌కి రోహిత్ శర్మయే కారణం...
రోహిత్ శర్మ చాలా అద్భుతమైన కెప్టెన్. చాలామంది ప్లేయర్లు, రోహిత్ కెప్టెన్సీలోనే వెలుగులోకి వచ్చారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కి రోహిత్ అవకాశం ఇచ్చాడు. కుల్దీప్ ఏం చేయగలడో రోహిత్‌కి బాగా తెలుసు...
అందుకే కుల్దీప్ యాదవ్‌ని యో యో టెస్టులకు, ఫిట్‌నెస్ సెషన్స్‌కి తీసుకెళ్లేవాడు. అతని రిపోర్టులకు పరీక్షించేవాడు. కుల్దీప్‌కి కావాల్సిన సపోర్ట్ అందించాడు. రోహిత్, పంత్, పాంటింగ్ లేకపోతే కుల్దీప్ యాదవ్ సక్సెస్ అయ్యేవాడు కాదు..
విరాట్ కోహ్లీ ఎక్కువగా అనుభవాన్ని నమ్ముతాడు. అందుకే అశ్విన్, జడేజాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ కంటే బాగా బ్యాటింగ్ చేస్తాడనే ఉద్దేశంతో అక్షర్ పటేల్‌కి అవకాశాలు ఇచ్చాడు...’ అంటూ కామెంట్ చేశాడు కపిల్ దేవ్ పాండే...