MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • తూచ్... నేను అలా అనలేదు! సీఈవో వెంకీ మైసూర్‌పై మాట మార్చిన శ్రేయాస్ అయ్యర్...

తూచ్... నేను అలా అనలేదు! సీఈవో వెంకీ మైసూర్‌పై మాట మార్చిన శ్రేయాస్ అయ్యర్...

ఐపీఎల్‌లో అయినా, టీమిండియాలో అయినా కెప్టెన్సీ దక్కించుకోవడం కంటే దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఈ విషయం తెలియకనే టీమిండియాలో విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరి అనుభవాలతో పాఠం నేర్చుకున్న శ్రేయాస్ అయ్యర్, త్వరగానే తన తప్పును సరిదిద్దుకున్నాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 15 2022, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Shreyas Iyer

Shreyas Iyer

ప్లేఆఫ్స్ రేసును సంక్లిష్టం చేసుకున్న తర్వాత ప్రతీ మ్యాచ్‌లో చచ్చీ చెడీ గెలుస్తూ, గుడ్డి దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తోంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది కేకేఆర్. ఈ పరాభవాలతో జట్టులో చాలా మార్పులు చేసింది. ప్రతీ మ్యాచ్‌కీ కొత్త టీమ్‌తో బరిలో దిగి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది... ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కి ముందు ఐదు మార్పులతో బరిలో దిగింది కేకేఆర్...

38

ముంబైతో మ్యాచ్ అనంతరం టీమ్ సెలక్షన్ గురించి మాట్లాడుతూ... ‘ప్లేయర్లకు మీరు ఈ మ్యాచ్ ఆడడం లేదని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కోచ్‌తో పాటు కొన్ని సార్లు సీఈవో కూడా టీమ్ సెలక్షన్‌లో పాలుపంచుకుంటారు. ప్రతీ ప్లేయర్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని స్వీకరిస్తారు...

48

అవకాశం వచ్చినప్పుడు నూటికి నూరు శాతం పర్ఫామెన్స్ ఇవ్వడానికి కష్టపడతారు... ’ అంటూ శ్రేయాస్ అయ్యర్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి...

58

సీఈవో కూడా టీమ్ సెలక్షన్ విషయంలో చేయి పెడతాడని కామెంట్ చేయడం వెనక శ్రేయాస్ అయ్యర్‌ ఉద్దేశం ఏంటని నిలదీస్తున్నారు నెటిజన్లు... టీమ్ సెలక్షన్ విషయంలో తనకి స్వేచ్ఛ ఉండడం లేదని అయ్యర్ ఫీల్ అవుతున్నట్టు ఉందని కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు...

68

దీంతో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం సీఈవో వెంకీ మైసూర్‌పై చేసిన కామెంట్లపై క్లారిటీ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్... తాను అలా అనలేదని, మీడియా వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మాట మార్చాడు...

78

‘నేను సీఈవో పేరు చెప్పాను అంటే, ఆయన జట్టులో చోటు దక్కించుకోని ప్లేయర్లను ఓదార్చడానికి నాకు తోడుగా ఉంటారు అని... ఇంత మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పుడు టీమ్‌ని సెలక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది...’ అంటూ వివరణ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్...

88

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 13 మ్యాచుల్లోనూ టీమ్‌లో మార్పులు చేసి, కొత్త కాంబినేషన్స్ ట్రై చేసింది... ఆఖరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడనుంది కేకేఆర్... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved