- Home
- Sports
- Cricket
- పర్పుల్ క్యాప్ అతను గెలిస్తే డబుల్ హ్యాపీ... యజ్వేంద్ర చాహాల్‌పై కుల్దీప్ యాదవ్ కామెంట్...
పర్పుల్ క్యాప్ అతను గెలిస్తే డబుల్ హ్యాపీ... యజ్వేంద్ర చాహాల్‌పై కుల్దీప్ యాదవ్ కామెంట్...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి భారత సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కేకేఆర్‌లో గత మూడు సీజన్లలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వని కుల్దీప్ యాదవ్‌పై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. అయితే సీజన్ ఆరంభమయ్యాక కుల్దీప్ యాదవ్, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొడతున్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 4 మ్యాచులు గెలవగా, నాలుగు మ్యాచుల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్...
ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ప్లేయర్‌గా నిలిచేందుకు కుల్దీప్ యాదవ్ మరో రెండు సార్లు ఈ ఫీట్ సాధిస్తే చాలు. 2016లో విరాట్ కోహ్లీ ఐదు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవగా, మరోసారి ఈ అవార్డు గెలిస్తే ఆ రికార్డును సమం చేస్తాడు కుల్దీప్ యాదవ్..
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్ యాదవ్, ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచులు ఆడి 17 వికెట్లు పడగొట్టి ‘పర్పుల్ క్యాప్’ రేసులో యజ్వేంద్ర చాహాల్ తర్వాతి స్థానంలో నిలిచాడు...
‘యజ్వేంద్ర చాహాల్‌తో నాకు ఎప్పుడూ పోటీ లేదు. చాహాల్, నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచి, నన్ను మోటివేట్ చేశాడు...
నా కంటే యజ్వేంద్ర చాహాల్ పర్పుల్ క్యాప్ గెలిస్తేనే డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతా... ఎందుకంటే అతను నాలుగేళ్లుగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు...
ఇప్పుడు నేను బెటర్ బౌలర్‌గా మారాను, ఇంతకుముందు కంటే మెంటల్‌గా స్ట్రాంగ్ అయ్యాను. జీవితంలో పడిపోయిన తర్వాత లేచి, మళ్లీ విజయాన్ని అందుకుంటే ఆ కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది...
ఇప్పుడు నాకు ఓడిపోతాను, పడిపోతాననే భయం లేదు. నా వరకూ ఇదే బెస్ట్ ఐపీఎల్ సీజన్. నా బౌలింగ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు కుల్దీప్ యాదవ్...
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న యజ్వేంద్ర చాహాల్, 8 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు... కేకేఆర్‌పై హ్యాట్రిక్ కూడా సాధించాడు చాహాల్..