- Home
- Sports
- Cricket
- వేరే ఫ్రాంఛైజీలకు ఆడాలని అనుకున్నా, ఆ టీమ్‌కి ఆడి ఉంటే... విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వేరే ఫ్రాంఛైజీలకు ఆడాలని అనుకున్నా, ఆ టీమ్‌కి ఆడి ఉంటే... విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2008 వేలంలో ఆర్‌సీబీకి వెళ్లిన విరాట్ కోహ్లీ, 15 సీజన్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. సీఎస్‌కేపై రెండేళ్లు బ్యాన్ పడడంతో ఎమ్మెస్ ధోనీ, ఈ రికార్డును అందుకోలేకపోయాడు...

2008 అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీని, 2008 ఐపీఎల్ వేలంలో రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2011 నుంచి 13 సీజన్ వరకూ రూ.8.28 కోట్లు అందుకున్న విరాట్, 2014 నుంచి 2017 వరకూ ఏటా రూ.12.5 కోట్లు అందుకున్నాడు...
ఐపీఎల్ 2018 సీజన్‌లో ఏకంగా రూ.17 కోట్లు పారితోషికం అందుకున్న ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొతం అందుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
‘ఓ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏ ఫ్రాంఛైజీ అయినా నమ్ముతుంది, అవకాశాలు ఇస్తుంది. అయితే ఓ టీనేజ్ ప్లేయర్‌గా టోర్నీని ఆరంభించినప్పుడు కూడా నన్ను నమ్మి, నాకు మొదటి సీజన్లు వరుస అవకాశాలు ఇచ్చింది ఆర్‌సీబీ...
నేను ఆరంభంలో వేరే టీమ్స్‌కి ఆడాలని అనుకున్నా. అయితే వేరే ఫ్రాంఛైజీకి వెళ్లి ఉంటే, కష్టకాలంలో నన్ను నమ్మి, ఆర్‌సీబీలా సపోర్ట్ చేసేవాళ్లు కాదేమో..
నిజం చెప్పాలంటే నేను కూడా ఒకానొక టైమ్‌లో వేరే టీమ్స్‌కి ఆడాలని అనుకున్నా. అలా అనుకోవడంలో తప్పు లేదు. చాలా ఫ్రాంఛైజీలు, నన్ను సంప్రదించాయి. వేలంలోకి వెళ్లి నాకు ఎంత ధర పలుకుతుందో చూడాలని అనుకున్నా...
అయితే రోజు ముగిసిన తర్వాత ప్రతీ ఒక్కరూ కొన్ని ఏళ్ల పాటు బతుకుతారు, ఆ తర్వాత మరణించారు. ఇలా సాగుతూనే ఉంటుంది. కష్టకాలంలో అండగా నిలిచిన టీమ్‌కి విశ్వాసం చూపించకపోతే, నేను వారిలో ఒకడినేగా... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి 218 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 6499 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. కెప్టెన్‌గా 140 మ్యాచులు ఆడి 64 విజయాలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ...
కెప్టెన్‌గా 9 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, 2021 సీజన్‌కి ముందే ఆర్‌సీబీ సారథిగా ఇదే ఆఖరి సీజన్ అంటూ ప్రకటించాడు. క్రికెట్ ఆడినంత కాలం ఆర్‌సీబీలోనే ఉంటానంటూ స్పష్టం చేశాడు...