- Home
- Sports
- Cricket
- అతను వేసిన ఆ నాలుగు ఓవర్లే, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి... హార్ధిక్ పాండ్యాపై రవిశాస్త్రి కామెంట్...
అతను వేసిన ఆ నాలుగు ఓవర్లే, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి... హార్ధిక్ పాండ్యాపై రవిశాస్త్రి కామెంట్...
దాదాపు రెండేళ్లుగా టీమిండియాలో స్థిరమైన చోటు సంపాదించుకోలేకపోతున్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో కీ ప్లేయర్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా, ఇప్పుడు టీమిండియాలో చోటు కోసం పోటీపడాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఐపీఎల్ 2022 సీజన్ అతని కెరీర్‌ని డిసైడ్ చేయనుంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టాడు హార్ధిక్ పాండ్యా. లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాండ్యా టీమ్ విజయాన్ని అందుకుంది...
బ్యాటింగ్‌లో 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో మాథ్యూ వేడ్‌తో కలిసి 57 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు...
‘తొలిసారి కెప్టెన్‌గా చేస్తుండడంతో దేశమంతా హార్ధిక్ పాండ్యాపైనే ఫోకస్ పెట్టింది. అయితే నేను మాత్రం అతను బౌలింగ్ చేస్తాడా? లేదా? అని ఎదురుచూశా...
అతను తొలి మ్యాచ్‌లోనే బౌలింగ్ చేయడమే కాదు, నాలుగు ఓవర్లు వేశాడు. పాండ్యా వికెట్ తీయలేకపోవచ్చు, కానీ అతను వేసిన నాలుగు ఓవర్లు చాలా పెద్ద విషయమే...
ఎందుకంటే నాలుగు ఓవర్లు పూర్తి చేసుకున్న హార్ధిక్ పాండ్యా, తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుని ఉంటాడు. ఇప్పుడు అతను టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జట్టులో పోటీదారుడు...
లక్నోతో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి, బాధ్యతగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇది గుజరాత్‌కి చాలా మంచి సంకేతం...
హార్ధిక్ పాండ్యా చాలా బాగా ఆడాడు. తన అన్న కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో చాలా ఛాన్సులు తీసుకున్నాడు. హార్ధిక్ త్వరగా అవుటై ఉంటే, మ్యాచ్ ఎప్పుడూ ముగిసిపోయేది...
హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉండి, బౌలింగ్ చేయగలిగితే టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాకుండా ఏ సెలక్టర్ కూడా ఆపలేడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో బౌలింగ్ చేయని హార్ధిక్ పాండ్యా, ఈ సీజన్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే 136+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు...
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా వికెట్ తీయలేకపోగా 37 పరుగులు సమర్పించాడు. వరుణ్ ఆరోన్ తర్వాత అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు హార్ధిక్...