MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బౌండరీలు కొట్టు, నన్ను ఇలా ఉరికించకు... ధోనీతో బ్రావో, మాహీ రియాక్షన్ వింటే...

బౌండరీలు కొట్టు, నన్ను ఇలా ఉరికించకు... ధోనీతో బ్రావో, మాహీ రియాక్షన్ వింటే...

ఐపీఎల్ 2022 సీజన్‌‌లో దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, లేటుగా ఫామ్‌లోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ రేసులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 09 2022, 07:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల స్కోరు చేసింది. ఆఖర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసి సీఎస్‌కే స్కోరుని 200 దాటించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

28
Image Credit: Getty Images (File Photo)

Image Credit: Getty Images (File Photo)

ఆన్రీచ్ నోకియా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఆఖరి రెండు బంతులను ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ, బౌండరీలు రాకపోవడంతో రెండేసి పరుగులు తీశాడు. 40 ఏళ్ల వయసులో మాహీ వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తడం చూసి ఐపీఎల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

38

40 ఏళ్ల ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో సింగిల్స్‌ని డబుల్స్‌గా మలుస్తుంటే నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న డీజే బ్రావో... మాహీతో సమానంగా పరుగెత్తలేక ఇబ్బంది పడ్డాడు...

48

‘నేను ఫేస్ చేసింది హ్యాట్రిక్ బాల్. మాహీకి స్ట్రైయిక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యా. అందుకే సింగిల్ ఇవ్వగానే బౌండరీలు కొట్టమని చెప్పా! టూస్ కోసం నన్ను పరుగెత్తించకని రిక్వెస్ట్ చేశా...
 

58

కానీ ఎమ్మెస్ నా మాట వినిపించుకోలేదు. ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ ఇలాంటి పొజిషన్ వస్తే నా బదులు వేరే ప్లేయర్‌ని రన్ చేయమను. నా భుజాలు భరించలేకపోతున్నాయి. గ్రేట్ బ్యాటర్‌తో మబ్ాయటింగ్ చేయడం గొప్పగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే ఆల్‌రౌండర్ డీజే బ్రావో...
 

68

టూస్ తీయవద్దని తనని రిక్వెస్ట్ చేసిన బ్రావోని తన స్టైల్‌లో ట్రోల్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డైవ్ చేసి, ఓ బౌండరీని ఆపాడు బ్రావో...

78

దీంతో‘వెల్ డన్ ఓల్డ్ మ్యాన్’... ‘బాగా ఆపావు ముసలోడా...’ అంటూ డీజే బ్రావోని ప్రశంసిస్తూ ట్రోల్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...  మాహీ కామెంట్లు స్టంప్ మైక్‌లో వినిపించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...

88

ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన డీజే బ్రావో 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో మాత్రం బ్రావో మెరుపులు కనిపించలేదు. ఇప్పటిదాకా 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 పరుగులే చేశాడు బ్రావో...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం
Recommended image2
విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల జోరు.. దెబ్బకు సెలెక్టర్లు బేజారు..
Recommended image3
జైస్వాల్‌కు రాజస్థాన్ షాక్.. కెప్టెన్సీ కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved