- Home
- Sports
- Cricket
- IPL2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే... రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై, పంజాబ్ కింగ్స్‌తో...
IPL2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే... రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై, పంజాబ్ కింగ్స్‌తో...
ఐపీఎల్ 2022 మెగా సమరానికి సైరన్ మోగింది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే సీజన్ 15కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడబోయే మ్యాచుల వివరాలివే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం మూడే మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఏడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 29న పూణేలోని ఎంసీఏ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది...
ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్‌తో డివై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఏప్పిల్ 9న అదే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతుంది...
ఏప్పిల్ 11న గుజరాత్ టైటాన్స్‌తో తలబడే ఆరెంజ్ ఆర్మీ, ఏప్రిల్ 15న బ్రాబోర్న్ క్రికెట్ స్టేడియంలో కేకేఆర్‌తో తలబడుతుంది...
ఏప్పిల్ 17న డివై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్, ఏప్రిల్ 23న బ్రాబోర్న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది...
ఏప్రిల్ 27న గుజరాత్ టైటాన్స్‌తో వాంఖడే స్టేడియంలో తలబడే ఎస్‌ఆర్‌హెచ్, ఎంసీఏ స్టేడియంలో మే 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతుంది...
ఆ తర్వాత మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడే ఆరెంజ్ ఆర్మీ, వాంఖడే స్టేడియంలో మే 8న ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడుతుంది. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి మొదలవుతుంది...
మే 14న కేకేఆర్‌తో మ్యాచ్ ఆడే సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 17న ముంబై ఇండియన్స్‌తో తలబడుతుంది. మే 22న పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ మధ్య జరిగే మ్యాచ్ ఆఖరి లీగ్ మ్యాచ్ కానుంది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏడు మ్యాచులు హోమ్‌లో ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మరో 7 మ్యాచులు బయట ఆడనుంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ మ్యాచులన్నీ ముంబై, పూణే నగరాల్లో నిర్వహించబోతుండడంతో ముంబై ఇండియన్స్‌కి మినహా ఏ జట్టూకీ సొంత మైదనం అడ్వాంటేజ్ ఉండదు...