- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది... రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్...
ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది... రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్...
ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించన పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ సీజన్ 15, మే 29న ఫైనల్‌తో ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది...

మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి...
గత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచులను ఒకే సమయానికి నిర్వహించి, ప్రయోగం చేసింది బీసీసీఐ. అయితే అది పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో పాత పద్ధతినే ఫాలో అవ్వనుంది...
డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 7:30కి రెండో మ్యాచ్ జరుగుతాయి..
గుజరాత్ లయన్స్ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో తలబడనుంది...
మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో లీగ్ మ్యాచులు ముగిస్తాయి...
ఐపీఎల్ 2022 సీజన్ నాకౌట్ మ్యాచులకు సంబంధించిన తేదీలను, వేదికలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు... అయితే అహ్మదాబాద్ వేదికగా నాకౌట్ మ్యాచులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.