- Home
- Sports
- Cricket
- ఓ వైపు వార్నర్ భాయ్, మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి పెద్ద సమస్యే!
ఓ వైపు వార్నర్ భాయ్, మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కి పెద్ద సమస్యే!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కీ, డేవిడ్ వార్నర్‌కీ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. 2014 సీజన్‌లో సన్‌రైజర్స్‌లోకి వచ్చిన డేవిడ్ వార్నర్, ఈ ఫ్రాంఛైజీని సొంత టీమ్ కంటే ఎక్కువగా అభిమానించి, ప్రేమించాడు... అయితే ఒక్క సీజన్, కాదు... కేవలం అర సీజన్ పర్ఫామెన్స్ కారణంగా అంతా మారిపోయింది. అభిమానం కాస్తా ప్రతీకారం కోసం వేచి చూసే పగగా మారిపోయింది...

ఆస్ట్రేలియా టీమ్‌కి ఆడడం కంటే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడడానికే ఎక్కువగా ఇష్టపడేవాడు డేవిడ్ వార్నర్. వార్నర్ కారణంగానే ఆరెంజ్ ఆర్మీకి మంచి క్రేజ్ వచ్చింది..
కేవలం డేవిడ్ వార్నర్ మాత్రమే కాకుండా ఆయన భార్య, పిల్లలు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్ట్ చేసేవాళ్లు. ఆరెంజ్ ఆర్మీని ప్రమోట్ చేస్తూ ఎస్‌ఆర్‌హెచ్ జెర్సీల్లో ఫోటోలు పోస్ట్ చేసేవాళ్లు...
అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ అన్నింటినీ మార్చేసింది. టీమ్ సెలక్షన్ విషయంలో వార్నర్ భాయ్ చేసిన వ్యాఖ్యలు, టీమ్ మేనేజ్‌మెంట్‌కి కోపాన్ని తెప్పించాడు. 6 మ్యాచులు ముగిసిన తర్వాత వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత జట్టు నుంచి కూడా దూరం చేసింది...
David Warner
మేనేజ్‌మెంట్‌తో విభేదాలకు తోడు సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన డేవిడ్ వార్నర్... మ్యాచులు చూసేందుకు స్టేడియానికి వచ్చేందుకు కూడా తనను అనుమతించడం లేదంటూ చేసిన కామెంట్లు, తీవ్ర దుమారం రేపాయి...
అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2022 మెగా వేలానికి డేవిడ్ వార్నర్‌ని విడుదల చేసింది సన్‌రైజర్స్. అన్నీ సజావుగా జరిగి ఉంటే, ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో ఫస్ట్ రిటెన్షన్ కార్డు వార్నర్ భాయ్‌కే దక్కేది... వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లిన డేవిడ్ వార్నర్, తొలిసారి సన్‌రైజర్స్‌కి ప్రత్యర్థిగా బరిలో దిగబోతున్నాడు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచి, 2016లో టైటిల్ అందించిన ఆరెంజ్ ఆర్మీ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, తన ప్రియమైన మాజీ టీమ్‌పై ఎలా ఆడతాడనేది అత్యంత ఆసక్తికరంగా మారింది...
8 సీజన్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ప్రత్యర్థిగా నేటి మ్యాచ్‌లో ఆడబోతున్నాడు డేవిడ్ వార్నర్. దీంతో ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌గా కాకుండా డేవిడ్ వార్నర్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా అభివర్ణిస్తున్నారు అభిమానులు...
ఓ వైపు తమ వాడిగా ఇన్ని సీజన్ల పాటు అభిమానించిన డేవిడ్ భయ్యా, మరో వైపు సొంత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్... దీంతో నేటి మ్యాచ్‌లో ఎవరికి సపోర్ట్ చేయాలనేది తేల్చుకోలేకపోతున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మెరుగైన పొజిషన్‌లో ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సన్‌రైజర్స్ 9 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది...