- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్ కెప్టెన్సీ, మహేంద్రుడు బ్యాటింగ్... సీఎస్‌కే వర్సెస్ లక్నో సూపర్ ఫైట్‌లో...
కెఎల్ రాహుల్ కెప్టెన్సీ, మహేంద్రుడు బ్యాటింగ్... సీఎస్‌కే వర్సెస్ లక్నో సూపర్ ఫైట్‌లో...
ఐపీఎల్ 2021 టోర్నీలో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలబడుతోంది. ఈ రెండు జట్లూ మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలుకావడంతో విజయం కోసం కసిగా పోరాడబోతున్నాయి.

ఐపీఎల్ ఓపెనర్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటుతో మ్యాజిక్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాహీ, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున నాన్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
మాహీ కారణంగా ఓ మోస్తరు స్కోరు చేయగలిగిన చెన్నై సూపర్ కింగ్స్, టాపార్డర్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది. గత సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు పెద్దగా రాణించలేకపోయారు...
Ravindra Jadeja
మొదటి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా నుంచి కూడా మెరుపులు రాలేదు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టడం మినహా అంతకుముందు 27 బంతులాడితే... ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు జడ్డూ...
Devon Conway
ఫాఫ్ డుప్లిసిస్‌కి రిప్లేస్‌మెంట్ అవుతాడని అనుకున్న డివాన్ కాన్వే, మొదటి మ్యాచ్‌లో ఇంప్రెస్ చేయలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొని 3 పరుగులకే పెవిలియన్ చేరాడు కాన్వే...
అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అందరి దృష్టి మహేంద్రుడిపైనే ఉంది. మాహీ బ్యాటు నుంచి మెరుపులు చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు...
అలాగే లక్నో సూపర్ జెయింట్స్ భారీ అంచనాలతో ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించింది. 7 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన లక్నో, మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది...
లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ కెప్టెన్సీ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసిన ఛమీరాతో పూర్తి కోటా వేయించకపోవడం వివాదాస్పదమైంది..
దీంతో అటు పక్క మహేంద్రుడి మ్యాజిక్ చూడాలని మాహీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే... ఇటు పక్క కెఎల్ రాహుల్ కెప్టెన్సీతో ఈసారైనా ఇంప్రెస్ చేయగలడా? అని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.