- Home
- Sports
- Cricket
- IPL 2022 CSK vs KKR: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే... అయ్యర్, జడేజా, ఎమ్మెస్ ధోనీలతో పాటు...
IPL 2022 CSK vs KKR: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే... అయ్యర్, జడేజా, ఎమ్మెస్ ధోనీలతో పాటు...
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కేకేఆర్ తలబడబోతున్నాయి. ఈ రెండు జట్లూ 2012లో తొలిసారి ఫైనల్‌లో తలబడగా కేకేఆర్ విజయం సాధించింది, రెండోసారి 2021 ఫైనల్ ఆడగా సీఎస్‌కే టైటిల్ సాధించింది. 2022లో ఇరు జట్లూ తలబడడంతో ఆసక్తి రేపుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీకి రాజీనామా చేసిన ఎమ్మెస్ ధోనీ, కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలో దిగబోతున్నాడు. మాహీ బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వస్తాడా? ధోనీ ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది..
అలాగే ప్లేయర్‌గా 13 సీజన్ల తర్వాత కెప్టెన్సీ దక్కించుకున్న రవీంద్ర జడేజా, మాహీ సభ్యుడిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎలా నడిపించబోతున్నాడనేది మొదటి మ్యాచ్‌తో తేలిపోనుంది..
గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఈ సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా నియమితుడయ్యారు. ఢీసీలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీషా, స్టోయినిస్, రబాడా వంటి యంగ్ ప్లేయర్లతో నిండిన జట్టును అద్భుతంగా నడిపించాడు శ్రేయాస్ అయ్యర్...
అయితే కేకేఆర్‌లో అజింకా రహానే, ఆరోన్ ఫించ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లు ఉన్నారు. ఈ సీనియర్లను అయ్యర్ ఎలా వాడుకుంటాడనేది కీలకంగా మారింది...
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో టీమ్‌లోకి వచ్చి, కేకేఆర్ కథను మార్చి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆల్‌రౌండర్ ప్లేస్ కోసం హార్ధిక్ పాండ్యాతో పోటీపడుతున్న వెంకటేశ్ అయ్యర్‌కి ఐపీఎల్ 2022 సీజన్ కీలకంగా మారనుంది...
ఐపీఎల్ పర్పామెన్స్ కారణంగా ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2021 ఆడే లక్కీ ఆఫర్ కొట్టేశాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి. అయితే ఐపీఎల్‌లో కనిపించిన మిస్టరీ, టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కనిపించలేదు...
గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. టీమిండియా తుదిజట్టులో స్థిరమైన చోటు కోసం చూస్తున్న రుతురాజ్, ఈ సీజన్‌లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
అండర్ 19 వరల్డ్ కప్ 2022 పర్ఫామెన్స్, ఆ తర్వాత తప్పుడు వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాడనే వివాదాలతో వార్తల్లో నిలిచిన యంగ్ ఆల్‌రౌండర్ రాజ్‌వర్థన్ హంగర్కేర్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడబోతున్నాడు...
శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడుల కారణంగా లంక క్రికెటర్లను శత్రువులుగా భావిస్తారు తమిళనాడు జనాలు. అలాంటిది తమిళనాడు ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్, లంక ప్లేయర్ మహీశ్ తీక్షణను కొనుగోలు చేసింది...
ఇప్పటికే తీక్షణను కొనుగోలు చేసినందుకు ‘బ్యాన్ సీఎస్‌కే’ అంటూ ఆ జట్టుపై నిరసన వ్యక్తం చేశారు తమిళులు. మరి నేటి మ్యాచ్‌లో తీక్షణకు తుదిజట్టులో చోటు దక్కుతుందా? దక్కితే సీఎస్‌కే ఫ్యాన్స్ ఎలా రియాక్డ్ అవుతారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.